E-Paper
Advertisement

మీకు అభిషేక్ ఉంటే, మాకు మాజ్ సదాకత్.. ఇక చూసుకుందాం రండి

మీకు అభిషేక్ ఉంటే, మాకు మాజ్ సదాకత్.. ఇక చూసుకుందాం రండి
Advertisement

Kamran Akmal On Maaz Sadaqat Vs Abhishek Sharma:  టీమిండియా ప్లేయర్లపై నిత్యం పాకిస్తాన్ మాజీలు ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారు. బాగా ఆడితే బ్యాట్లలో స్ప్రింగులు, చిప్పులు పెట్టారని విమర్శలు చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు. అదే అట్టర్ ఫ్లాప్ అయితే ఫ్లాట్ మైదానాలలో మాత్రమే ఇండియన్ క్రికెటర్లు ఆడతారని పరువు తీస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా శ్రీలంకతో జరిగిన టి20 సందర్భంగా మాజ్ స‌దాక‌త్ అనే పాకిస్తాన్ బ్యాటర్ అదరగొట్టాడు. అయితే అతని ఇన్నింగ్స్ గురించి ప్రస్తావించిన మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మీకు అభిషేక్ ఉంటే, మాకు మాజ్ సదాకత్.. ఇక చూసుకుందాం రండి

మీకు అభిషేక్ ఉంటే, మాకు మాజ్ సదాకత్.. ఇక చూసుకుందాం రండి అంటూ క‌మ్రాన్ అక్మ‌ల్ స‌వాల్ విసిరారు. అభిషేక్ శర్మ కంటే మాజ్ సదాకత్ చాలా బెటర్ ఆటగాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు ఇలాంటి ఆటగాడు దొరకలేదని… ఇప్పుడు తేల్చుకుందాం రా అంటూ టీమిండియా కు సవాల్ విసిరారు. అభిషేక్ శర్మ కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేస్తే… మాజీ సదాకత్ మాత్రం గుండెలు అదిరిపోయేలా బాదుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీమిండియాకు ఇక నరకమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మాజ్ సదాక‌త్ బ్యాటింగ్ పై కమ్రాన్ అక్మ‌ల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

శ్రీలంకతో జరిగిన రెండో టి20 సందర్భంగా మెరిసిన మాజ్ సదాకత్

శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో రెండవ మ్యాచ్ అక్టోబర్ 11వ తేదీన జరిగింది. ఈ సందర్భంగా అనూహ్యంగా మాజ్ సదాకత్ వెలుగులోకి వచ్చాడు. పాకిస్తాన్ పైన 51 బంతులు ఎదుర్కొన్న మాజ్ సదాకత్ 96 పరుగులు సాధించాడు. ఇందులో 7 సిక్సర్లతో పాటు ఆరు బౌండరీలు ఉన్నాయి. 188.24 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు. దీంతో రెండో మ్యాచ్ లో లంక పై 82 పరుగులు తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అదరగొట్టిన మాజ్ సదాకత్ పై పాకిస్తాన్ మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మాజ్ సదాకత్ పై క‌మ్రాన్ అక్మ‌ల్ ప్ర‌శంస‌లు

Advertisement

మాజ్ సదాకత్ ఇన్నింగ్స్ పై తాజాగా కమ్రాన్ అక్మల్ కూడా స్పందించారు. ఇన్ని రోజులు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూశారు… ఇకపై మాజ్ సదాకత్ శకం నడుస్తుందని శపథం చేశారు. అభిషేక్ శర్మ కళ్ళు మూసుకొని ఆడతాడని.. కానీ మాజ్ సదాకత్ అదిరిపోయే సిక్సర్లు కొడతాడని వ్యాఖ్యానించారు. అతడు వాడే భారీ షాట్లకు బౌలర్లు గజగజ వణిచిపోతారని హెచ్చరించారు. పూర్తిగా హిట్టింగ్ కాకుండా మధ్యలో సింగిల్స్ తో కూడా ఇన్నింగ్స్ డెవలప్మెంట్ చేస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ఆటగాడు ఎక్కువ రోజులు క్రికెట్ లో కొనసాగుతాడని వెల్లడించారు. గతంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఇలాంటి ఆటగాళ్లు చాలా మంది ఉండేవారని.. వాళ్లు కనుమరుగు అయిపోయినట్టు వివరించారు. కానీ అలాంటి పాత కాలపు క్రికెటర్ మాజ్ సదాకత్ రూపంలో ఇప్పుడు తెరపైకి వచ్చినట్టు వివరించారు. అభిషేక్ శర్మలాంటి ఎంతోమంది రికార్డులను మాజ్ సదాకత్ బద్దలు కొట్టడం గ్యారంటీ అని స్పష్టం చేశారు.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

 

Related News

ఆ ఒక్క‌డు లేక‌పోతే, జింబాబ్వే చేతిలోనూ టీమిండియా ఘోరంగా ఓడిపోతుంది

తుఫాన్ లాంటి బ్యాట‌ర్ ను వాట‌ర్ బాయ్ చేస్తావా ? గంభీర్ పై వైభ‌వ్ కోచ్ సీరియ‌స్‌

ఎమ‌ర్జెన్సీ పాల‌న‌…పాకిస్తాన్, శ్రీలంక టీ20 సిరీస్ పై నీలినీడ‌లు

ఇక‌పై టీమిండియా చాలా జాగ్ర‌త్తగా ఉండాలి..నా నుంచి దేవుడు కూడా కాపాడ‌లేడు

మ్యాచ్ మ‌ధ్య బిర్యానీ తిన్న ష‌మీ…బండ‌బూతులు తిట్టిన ర‌విశాస్త్రి!

బౌలర్‌గా సచిన్ కొడుకు పనికేరాడు…అన్ని మూసుకుని ఆ పని చేయాలి

ఒరేయ్ పంజాబీ అంటూ విరాట్ కోహ్లీ నన్ను అవమానించాడు

Big Stories

Advertisement
×