BigTV English

Komatireddy : చెరుకు సుధాకర్ కు డెత్ వార్నింగ్ .. ఆడియోపై కోమటిరెడ్డి క్లారిటీ..

Komatireddy : చెరుకు సుధాకర్ కు డెత్ వార్నింగ్ .. ఆడియోపై కోమటిరెడ్డి క్లారిటీ..

Komatireddy : కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తోంది. తాజాగా మరో వివాదంలో ఆయన చిక్కుకున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, ఆయన కుమారుడు సుహాస్‌ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్‌ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోమటిరెడ్డి ఇచ్చిన వార్నింగ్ చర్చనీయాంసంగా మారింది.


చెరుకు సుధాకర్ కుమారుడికి ఇచ్చిన వార్నింగ్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను భావోద్వేగంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. వేరే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరినీ దూషించలేదని చెప్పుకొచ్చారు. చెరుకు సుధాకర్‌పై పీడీ యాక్ట్‌ పెడితే ఎత్తివేయాలని తానే పోరాటం చేశానని గుర్తు చేశారు. తనపై విమర్శలు చేయవద్దనే సుధాకర్‌ కుమారుడికి చెప్పానన్నారు. తన మాటలను కట్‌ చేసి కొన్ని వ్యాఖ్యలను మాత్రమే లీక్‌ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి చెరుకు సుధాకర్‌ తనను విమర్శిస్తున్నారని ఎందుకు తిడుతున్నావని అడిగానన్నారు. తనపై విమర్శలు మానుకోవాలని మాత్రమే సుహాస్‌కు చెప్పానన్నారు.

కోమటిరెడ్డి ఆడియో క్లిప్‌లో ఏముందంటే..
‘మీ నాన్న వీడియో చూసావా? ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టాడు. నెలరోజుల నుంచి ఓపిక పడుతున్నా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా? వాడిని వదిలేది లేదు. క్షమాపణ చెప్పకపోతే మా వాళ్లు చంపుతారు. నా అభిమానులు వంద కార్లల్లో బయల్దేరారు. ఇంటి పార్టీ ఏంటీ? వాడు ( చెరుకు సుధాకర్ ) పీడీ యాక్ట్‌ కేసులో జైల్లో ఉంటే నేను ఒక్కడినే వెళ్లి పరామర్శించాను. కౌన్సిలర్‌గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించాను. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నేను ఎంతమందినని ఆపుతాను. నిన్ను కూడా చంపేస్తారు. నీ హాస్పిటల్‌ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు’ అని కోమటిరెడ్డి ఫోన్ లో చెరుకు సుధాకర్ కుమారుడితో మాట్లాడారు.


చెరుకు సుధాకర్‌ రియాక్షన్..
ఈ ఆడియోను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి పంపించానని సుధాకర్‌ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి.. తనపై చేసిన వ్యాఖ్యలపై అధిష్టానమే చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కోమటిరెడ్డిపై సుహాస్‌ నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని కోరారు. కోమిటిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×