Komatireddy: ప్రతిభ ఎంత ఉన్నా.. పేదరికం అనే అడ్డంకి పడితే ఎంతోమంది యువతీ యువకుల కలలు ఆవిరైపోతుంటాయి. కానీ, సరైన సమయంలో ఒక నమ్మకం, చిన్న సాయం తోడైతే వారు ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. సరిగ్గా అలాంటి ఆర్థిక భరోసానే అందించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఐఐటీ మద్రాస్‌లో చదువు పూర్తి చేసుకున్న పరిమళ అనే పేద విద్యార్థినికి జర్మనీలో మాస్టర్స్ పూర్తి చేసే అవకాశం వచ్చింది. అయితే, విదేశాల్లో చదువుకు కావాల్సిన భారీ వ్యయం ఆమె కుటుంబానికి పెద్ద భారంగా మారింది. ఈ విషయం దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ చొరవతో మంత్రి దృష్టికి వెళ్లగా.. ఆయన తక్షణమే స్పందించారు.
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పరిమళ విదేశీ విద్య కోసం రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. ఈ సందర్భంగా చెక్కును ఆమెకు అందజేస్తూ.. ‘ప్రతిభకు పేదరికం ఎప్పుడూ అడ్డుకాకూడదు, సరైన అవకాశం లభిస్తే మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణిస్తారు’ అని ఆకాంక్షించారు.
Also Read: సీఐడీ ఆరోపణలను తిప్పికొట్టిన కాదంబరి జెత్వానీ.. అసలు వీడియోలో ఏముంది?
కష్టపడి పైకి వచ్చి ఉన్నత చదువులు చదవాలనుకునే పేద విద్యార్థులకు తనవంతుగా ఎప్పుడూ అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. సరైన సమయంలో అందిన ఈ ఆర్థిక సాయంతో పరిమళ కుటుంబ సభ్యులు, స్థానికులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ఎమ్మెల్యే బాలునాయక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఐఐటీ విద్యార్థినికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించిన మంత్రి కోమటిరెడ్డి
ఐఐటీ మద్రాస్ విద్యార్థిని పరిమళ జర్మనీలో మాస్టర్స్ చదివేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ చొరవతో ఈ విషయం మంత్రి… pic.twitter.com/xX81oXAjle
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2026