Kaalamega Karigindhi Movie Review : ‘ఈ వారం చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘కాలమేగా కరిగింది’ ఒకటి. ఈ సినిమా టీజర్, ట్రైలర్సే చాలా నీరసంగా అనిపించాయి. మరి సినిమా ఎలా అనిపిస్తుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
ఫణి (వినయ్ కుమార్/ చైల్డ్ ఆర్టిస్ట్ ఫణి – అరవింద్) కెరీర్లో సక్సెస్ అయిన ఒక కుర్రాడు. అయితే అతనిలో తెలీని ఓ బాధ ఉంటుంది. అది అతని ఫస్ట్ లవ్ గురించి. చిన్నప్పుడే అతను బిందు(శ్రావణి/ చైల్డ్ ఆర్టిస్ట్ బిందు – నోమిన తార) ని ప్రేమిస్తాడు. ఆమెకు కూడా ఇతనంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల వీళ్ళు దూరమవ్వాల్సి వస్తుంది. అయినప్పటికీ ఒకరికోసం ఇంకొకరు ఎదురుచూస్తామని చెప్పుకుంటారు. దీంతో ఫణి కెరీర్లో సక్సెస్ అయ్యాక అతని ఊరికి వెళ్తాడు. అదే క్రమంలో స్కూల్ కి .. అలాగే బిందుతో కలిసి తిరిగిన ప్రదేశాలకి అతను వెళ్తూ ఉంటాడు.
బిందుకి దూరమయ్యాక ఉత్తరాల ద్వారా వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. తర్వాత బిందు ఒక కాసెట్ పంపుతుంది. అందులో ఉన్న మేటర్ ఫణి వినడు. పక్కన పెట్టేస్తాడు. ఊరికి వచ్చాక అతనికి క్యాసెట్ దొరుకుతుంది. అందులో నీకోసం ఇంకా ఎదురుచూస్తున్నాను అని బిందు చెబుతుంది. అయితే ఇంతకీ బిందు ఏమైంది? చివరికి ఫణి ఆమె ఆచూకీ కనుగొన్నాడా? సినిమాకి హ్యాపీ ఎండింగ్ పడిందా? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ :
ఈ రోజుల్లో ఏ సినిమా అయినా సరే కథ, స్క్రీన్ ప్లే వంటివి ఫాస్ట్ గా ఉండాలి. ఒకటే సందర్భం ఎక్కువసేపు సాగదీస్తే ఆడియన్స్ కి నచ్చట్లేదు. ‘దీనికోసం ఇంతసేపు సినిమా సాగదీసాడా దర్శకుడు?’ అనే ఆలోచనకి వెంటనే వచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న ‘సప్త సాగరాలు దాటి’ అనే సినిమా వచ్చినప్పుడు, చూసినప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఫీలయ్యారు. అయినా సరే దర్శకుడు సింగార మోహన్.. అలాంటి స్లో నెరేషన్ సినిమా తీసే సాహసం చేశాడు. సినిమా గురించి చెప్పాలి అంటే కవి హృదయం ఉంటే తప్ప.. ఈ సినిమాని చివరి వరకు చూడటం కష్టం.
తనలోని భావుకత్వం అంతా పోగేసి ..సంభాషణలు రాసుకున్నాడు. ఒకటి మిస్ అయినా నెక్స్ట్ సీన్ అర్ధం కాని రేంజ్లో స్క్రీన్ ప్లే ఉంటుంది. చిన్నప్పటి ప్రేమని ప్రియురాలిని వెతుక్కుంటూ.. హీరో ఊరికి వెళ్లడం అనే కాన్సెప్ట్ తో గతంలో సినిమాలు వచ్చాయి. సుధీర్ బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిందే. ఇంకా చాలా ఉన్నాయి.
అయితే ఈ సాగదీతని మొత్తం మ్యూజిక్ తో మేనేజ్ చేయాలని దర్శకుడు భావించాడు.ఆ రకంగా చూసుకుంటే సంగీత దర్శకుడు గుడప్పన్ వందకి వంద శాతం న్యాయం చేశాడు. మ్యూజిక్ బాగుంది. పాటలు చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చాయి. కానీ అది కూడా టార్గెటెడ్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుంది. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలకి తగ్గట్టు ఔట్ఫుట్ ఇచ్చాడు.
నటీనటుల విషయానికి వస్తే : శ్రావణి మజ్జరి, అరవింద్ ముడిగొండ, అస్వద్ చిలుకూరి, నోమినా తారే.. ఎటు చూసినా ఎక్కువ సేపు కనిపించేది వీళ్ళే. వీళ్ళ వరకు సెటిల్డ్ గా చేశారు. దర్శకుడి రైటింగ్ కి వీళ్ళు న్యాయం చేశారనే చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
సాగదీత
స్క్రీన్ ప్లే లో వేగం లేకపోవడం
మొత్తంగా… ముందుగా ‘కాలమేగా కరిగింది’ సినిమా చూడాలనుకునే వారిలో కవి హృదయం ఉండాలి. లేదు అంటే ఈ సినిమాని చివరి వరకు చూడటం కష్టం. ఓటీటీలోకి వచ్చినా ఫాస్ట్ ఫార్వార్డ్ ఆప్షన్ ని వాడకుండా ఈ సినిమాని కంప్లీట్ చేయలేరు.
Kaalamega Karigindhi Telugu Movie Rating : 1.5/5