TSLatest Updates

Konda Murali : రేవంత్ రెడ్డే సీఎం.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: కొండా మురళి

konda-murali-sensational-comments

Konda Murali news today(Political news in telangana) : కాంగ్రెస్‌ నేత కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్సేదే గెలుపని తేల్చిచెప్పారు. సీఎం అయ్యేది రేవంత్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. యువతను తాగుడుకు బానిసను చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ శ్రేణులపై చెయ్యి వేస్తే.. ఆ చెయ్యి తీసేస్తామని హెచ్చరించారు.

వరంగల్ లో కబ్జాల పర్వం కొనసాగుతోందని కొండా మురళి ఆరోపించారు. కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచాక కబ్జారాయుళ్ల పని పడతామని హెచ్చరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంచి పాలన 6 నెలల్లో వస్తుందని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. పేదలకు ఇచ్చిన స్థలాలను కబ్జా గురయ్యాయని.. ఆక్రమించుకున్న ఆ భూములను తిరిగి పేదలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

కొండా మురళి తాజాగా చేసి కామెంట్స్ తెలంగాణలో హాట్ టాపిక్ మారాయి. రేవంత్ రెడ్డే సీఎం అవుతారని చెప్పడం పార్టీలో కొత్తచర్చకు తెరలేపింది. ఈ వ్యాఖ్యలపై సీనియర్ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Related posts

SBI : కార్పొరేట్ దిగ్గజాలను మించి రాణించిన SBI

BigTv Desk

Things to Do in the Morning after Waking up : ఉదయం నిద్రలేవగానే ఇలా చేస్తున్నారా…!

Bigtv Digital

Earth Inner Core Came:రొటేషన్ ఆపేసిన భూభాగం.. కారణం ఏంటంటే..?

Bigtv Digital

Leave a Comment