Bus Train Crash Just Miss| దేశంలో గత కొంత కాలంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం సురక్షితమైన రైలు ప్రయాణం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. కవచ్ అనే టెక్నాలజీని సైతం తీసుకురాబోతోంది. రైలు ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. మరోవైపు ఒక రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా దాదాపు వంద మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఒక రైల్వే గేట్ మెన్ తన పని సరిగా చేయకపోవడంతో ఒక బస్సును రెండు రైళ్లు దాదాపు ఢీకొనేంత పరిస్థితి ఎదురైంది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లా షహ్‌దోరా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఒక రైల్వే గేట్ వద్ద పనిచేస్తున్న గేట్ మెన్ రాత్రి వేళ డ్యూటీ సమయంలో మద్యం సేవించి అపస్మారక స్థితిలో ఉన్నాడు. రైల్వే గేట్లు తెరిచే ఉన్నాయి. అదే సమయంలో ఎదురెదురుగా వేర్వేరు లైన్లలో రెండు రైళ్లు వస్తున్నాయి. సరిగ్గా అప్పుడే రైల్వే గేటు వద్ద బస్సు వచ్చింది. ఆ బస్సుటో 100 మంది ప్రయాణికులు న్నారు. గేటు తెరిచి ఉండడంతో బస్సు రైల్వే ట్రాక్ సమీపంగా వచ్చేసింది. దీంతో ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఆ బస్సును ఢీకొట్టబోయాయి.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి
కానీ ఇదంతా గమనించిన కొందరు స్థానికులు రైళ్లకు ఎదురుగా దూరం నుంచి రైలు ఆపాలని సైగలు చేశారు. అదృష్టవశాత్తు అది గమనించిన రెండు రైళ్ల డ్రైవర్లు (లోకోపైలట్లు) సమయానికి బ్రేకులు వేశారు. ఆ సమయంలో బస్సు.. రైల్వే ట్రాక్ కు అతి సమీపంగా ఉంది. పొరపాటున రైలు డ్రైవర్లు బ్రేకులు వేసి ఉండకపోతే.. బస్సులో ఉండే 100 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటన ని అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్‌లో పెట్టాడు.
ఆ వీడియో చూసిన నెటిజెన్లు ఆ గెట్ మెన్ పై ఆగ్రహంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి రైల్వే ఉద్యోగులు ఉన్నంత కాలం ప్రజల ప్రాణాలకు భద్రత లేదు. అని పోస్ట్ లు పెడుతున్నారు. మరికొందరు అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!
ప్రస్తుతం రైల్వే అధికారులు ఘటనపై విచారణ చేస్తున్నారు. ఇదంతా రైల్వే ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా జరిగిందని తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.