Intinti Ramayanam Today Episode January 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ బావ పార్వతి అత్తయ్య కొడుకే కాదట రాజేంద్రప్రసాద్ మావయ్య మొదటి భార్య కొడుకు అంట ఈ విషయం బావగారికి కూడా తెలియదు బావగారికి చెప్తే ఇక ఇంట్లో ఎంత పెద్ద రచ్చవుతుందో తెలుసా నీకు అనేసి అంటుంది. అవని ఈ విషయాన్ని పార్వతిని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది.. ఇక ఉదయం లేవగానే అవని దగ్గరికి పల్లవి వస్తుంది. అక్క నువ్వు ఒక్కదానివే పని చేసుకుంటున్నావా నాకు చెప్పొచ్చు కదా అని అనగానే రాత్రి బాగానే ప్లాన్ చేసావ్ నన్ను ఇరికించాలని అత్తయ్య ముందర దోషిని చేయాలని అనుకున్నా నీ ప్లాను వర్కౌట్ అయింది కదా మరి నాతో ఏం పని అనేసి అవని అంటుంది.. నువ్వు తెలివైన దానివి అక్క నేను ఏం చేసినా కనిపెడతావని పల్లవి అంటుంది. ఈ విషయం కాదు అక్క ఇక నాకు ఒక సీక్రెట్ తెలిసిపోయింది అది గనక ఇంట్లో చెప్తే వైల్డ్ ఫైర్ తెలుసా ఇంట్లో మొత్తం బ్లాస్ట్ అవుతుంది రచ్చ రచ్చ జరుగుతుంది. నీ ఆటలు ఇక సాగవు అని అవని అంటుంది. ఆరాధ్య కారు కింద పడిపోతుంటే చెంచులమ్మ పట్టుకుంటుంది. ఆరాధ్య కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలి దేవుడులా వచ్చి నా బిడ్డను కాపాడారమ్మ అనేసి ఆమెకు కృతజ్ఞతలు చెబుతుంది. ఈమె పేరు చెంచులమ్మ మీ అత్తయ్య గారి చిన్ననాటి స్నేహితురాలు అనేసి రాజేంద్రప్రసాద్ అందరికీ పరిచయం చేస్తారు. పల్లవి తాళాలు కింద పోగొట్టుకున్నప్పుడు అవని ఇస్తుంది. పల్లవి మాత్రం పైన పార్వతిని చూసి నాటకం ఆడుతుంది. కావాలంటే నేను ఇస్తాను కదా దొంగతనం చేయడం ఎందుకని డ్రామా మొదలు పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఎలాంటిదో తెలుసుకోవడానికి చెంచులమ్మను పార్వతి పిలిచిందనే నిజాన్ని తెలుసుకున్న భానుమతి పల్లవి తో చెప్తుంది. మనిద్దరం కలిసి ఇలా ప్లాన్ చేస్తున్నామని అవన్నీ నిరికిస్తున్నామని తెలిస్తే మనల్ని చంపేస్తుంది ఇంట్లో ఈ విషయాన్ని చెప్పి మనల్ని గెంటెయించిన గెంటేస్తుంది ఇక నీ మొగుడు గురించి నువ్వు ఆలోచించు. వాడు కనీసం బతకనివ్వడు అనేసి హెచ్చరిస్తుంది.. నా పెద్ద కోడలుకి ఆస్తి మీద మోజు పడింది. అందుకే ఇలా చేస్తుంది ఇంటిని ముక్కలు చేస్తుందని భయంగా ఉందని అంటుంది.. నీకు ఫోన్ చేసి పిలిపించడానికి ఇదే కారణం అని పార్వతి అంటుంది. నేను చూశాను కదా నేను చెప్తాను ఎవరు ఎలాంటి వాళ్ళు అనేసి చంచలమ్మ అంటుంది. ఇక అవని వంట చేస్తుంటే చెంచులమ్మ అక్కడికి వెళ్లి వంటను రుచి చూస్తుంది. నేను అంతగా బాగా చేస్తానని చెప్పలేదు కానీ అందరూ తినేలానే చేస్తానండి అని అనగానే చెంచులమ్మ ఇల్లాలు వంటలోనే ఆమె గుణం ఏంటో చెప్పగలము అని అంటారు కదా అవన్నీ చేసిన వంటల్ని రుచి చూస్తుంది. ఇదేంటి అవని ఉప్పు కారం లేకుండా చప్పగా ఉన్నాయనేసి అంటుంది..
చప్పగా ఉన్నాయా నేను అన్ని చూసే చేశానండి అనేసి అనగానే ఒకసారి నువ్వే చూడు చెంచులమ్మ అంటుంది. తర్వాత నువ్వు వంటల్ని బాగా చేసావని అనేసి మెచ్చుకుంటుంది.. ఇక మెల్లగా మాటల్లో పెట్టి ఆస్తి అంటే నీకు మోజు ఉందా అనేసి అడుగుతుంది. కావాలంటే నీకు గౌరవం లేదా అని ఒక్కో ప్రశ్నతో నిజాలను బయట పెట్టేందుకు చెంచులమ్మ ప్రయత్నం చేస్తుంది. అవని మాట్లాడిన తీరుతో చెంచులమ్మ ఫిదా అయిపోతుంది ఇక అవన్నీ తప్పు ఉందా లేదా అని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అటు పల్లవి చెంచులమ్మకు అనుమానం రాకుండా ఉండాలని ఫోన్లు కూడా మాట్లాడకుండా ఉండాలని అనుకుంటుంది. చెంచులమ్మ విషయం తన డాడీకి చెపుతుంది. ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి తన డాడీతో పంచుకుంటుంది. అది విన్న చెంచులమ్మ పల్లవి నిజస్వరూపం గురించి ఎలాగైనా బయట పెట్టాలని అనుకుంటుంది. ఇక తర్వాత రోజు చెంచులమ్మ పార్వతి దగ్గరికి వెళ్లి అసలు నిజం చెప్పాలని అనుకుంటుంది.. ఇంట్లో అందర్నీ పిలుస్తుంది. ఇక అసలు దొంగ ఎవరో తనకు తెలిసిపోయిందని మర్యాదగా నేను చెప్పేంతవరకు ఉంటారా మీరే దొరికిపోతారా అనేసి ఒక అవకాశం ఇస్తుంది. కానీ పల్లవి మౌనంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకెందుకు అనేసి పార్వతి అంటుంది. నువ్వు చెప్పమంటావా పల్లవి నన్ను చెప్పమంటావా అని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లో జరగడానికి ఇదంతా కారణాలు ఎవరో కాదు పల్లవిని అని నిజాన్ని బయటపెడుతుంది. పల్లవిని అందరూ నాన్న మాటలతో తిడతారు. అవని నెత్తిన పెట్టుకుంటారు. పల్లవిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు కమల్. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి కలగనిందా లేక ఇది నిజమా అన్నది తెలియనిది..