BigTV English

KTR On Metro : హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ

KTR On Metro : హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ

KTR On Metro : మెట్రో రైలు విస్తరణకు ఆర్థికసాయం అందించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హరిప్రీత్‌ సింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. రెండో దశ కింద నిర్మించబోయే బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌, నాగోల్‌-ఎల్బీనగర్‌ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని లేఖలో పేర్కొన్నారు. ఫేజ్‌-2 విస్తరణ పనులకు రూ. 8, 453కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారని వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. మొదటి దశ కింద 69 కిలోమీటర్ల నిర్మించిన మెట్రో విజయవంతంగా నడుస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు.


రెండో దశలో మొత్తం 31కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు 26 కిలోమీటర్లు మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఇందులో 23 స్టేషన్లు నిర్మిస్తారు. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5కిలోమీటర్లు విస్తరిస్తారు. ఈ మార్గంలో కొత్తగా 4 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.

మరోవైపు మెట్రో రైలు చార్జీలు 25 నుంచి 30 శాతం పెంచుతారని వార్తలు వస్తున్నాయి. పెరిగిన టికెట్‌ ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. చార్జీల పెంపునకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఫెయిర్‌ ఫిక్సేషన్‌ కమిటీకి ఈ– మెయిల్‌ ద్వారా సలహాలు పంపించేందుకు విధించిన గడువు ముగిసింది. ఇప్పటికే ప్రజల నుంచి సూచనలు, సలహాలు అందాయి. టిక్కెట్ రేటు ఎంత పెరుగుతుందో కొన్ని రోజుల్లో క్లారీటీ వచ్చే అవకాశం ఉంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×