BigTV English

Skin Care: చెక్కరతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది

Skin Care: చెక్కరతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది

Skin Care: చాలా మంది తమ ముఖం అందంగా ఉండాలనే కోరుకుంటారు. అందుకోసం రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటి వల్ల తాత్కాళిక మెరుపు వస్తుంది. ఏదేమైనా కానీ ముఖాన్ని పట్టించుకునే వారు చాలా మంది ఉన్నప్పటికీ రంగు మారిన నల్లని మెడను ఎవరూ పట్టించుకోరు. మెడ కూడా తరుచుగా దుమ్ము, సూర్యరశ్మి, చెమట వల్ల నల్లబడుతుంది. అంతే కాకుండా సరిగ్గా శుభ్రం చేయకపోవడం, చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా మెడ నల్లబడటానికి కారణం అవుతుంది.


ఈ సమస్య తీవ్రమైనది కానప్పటికీ, ఇది మీ అందంపై ప్రభావం చూపుతుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, చక్కెరతో కొన్ని హోం రెమెడీస్ వాడటం వల్ల అనేక మెడపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా మెరిసే మెడ మీ సొంతం అవుతుంది.

చక్కెర, నిమ్మకాయ స్క్రబ్ :


ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చెంచా పంచదార, సగం టీ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత 5-10 నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ రెమెడీని వారానికి రెండుసార్లు ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల రంగు మారిన మెడ తిరిగి మామూలు రంగులోకి మారుతుంది.

చక్కెర, తేనె స్క్రబ్ :
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చెంచా చక్కెర, ఒక చెంచా తేనె కలపండి. దీన్ని మెడపై అప్లై చేసి 5 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. దీనిని 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు ఉపయోగించండి. దీనిని తరుచుగా చేయడడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. అంతే కాకుండా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

Also Read: పండగ సమయంలో పార్లర్‌కి వెళ్లకుండానే మెరిసే పాదాలు మీ సొంతం !

చక్కెర, బేకింగ్ సోడా స్క్రబ్ :
ఒక టీస్పూన్ చక్కెరలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలపాలి. అందులో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్‌ను మెడపై అప్లై చేసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జిడ్డు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. తరుచుగా ఈ స్క్రబ్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చక్కెర, అలోవెరా జెల్:
ఒక బౌల్‌లో ఒక టీస్పూన్ తాజా అలోవెరా జెల్‌ను ఒక టీస్పూన్ చక్కెర వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ ను మెడకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత 10-15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు మెడకు అప్లై చేస్తే రంగు మారుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Food: ఖాళీ కడపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు తెలుసా ?

Cancer Risk: వంటగదిలో ఉన్న ఈ ఆహార పదార్థాలతో.. క్యాన్సర్‌కు చెక్

Ritika Nayak: జోరు పెంచిన మిరాయ్ బ్యూటీ.. ఘనంగా స్టోర్ లాంఛ్

Hand Dryer: పరిశుభ్రత పేరుతో అనారోగ్యం.. వామ్మో ఇంత డేంజరా ?

Diabetes health Tips: డయాబెటిస్‌కు సులువైన పరిష్కారం.. ఈ పండు ఆకు నీటిని తాగితే చాలు!

Walking: డైలీ 20 నిమిషాలు నడిస్తే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Food and Age: ఇలాంటి ఫుడ్ తింటే.. త్వరగా ముసలి వాళ్లవుతారట !

Food For Better Digestion: భోజనం చేసాక ఇవి తింటే.. జీర్ణ సమస్యలు దూరం

Big Stories

×