E-Paper
Advertisement

Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!

Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!
Advertisement

తెలంగాణలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ,  ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రజాతీర్పు తమకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఇతర పార్టీల కౌన్సిలర్లను ప్రలోభపెట్టో లేదా ఒత్తిడి తెచ్చో పీఠాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ భావిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలంలో కొనసాగుతున్న బిఆర్ఎస్ కౌన్సిలర్ల క్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసుల దాడి.. సుమన్ అప్రమత్తత..

Advertisement

క్యాతనపల్లికి చెందిన బిఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ప్రస్తుతం భద్రాచలంలోని నందిని హోటల్‌లో క్యాంపులో ఉన్నారు. వీరిని చెదరగొట్టేందుకు కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు పోలీసులు హోటల్‌పై అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. అయితే, ముందస్తు సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. పోలీసులు హోటల్‌లోకి ప్రవేశించేలోపే కౌన్సిలర్లను అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ పరిణామంతో భద్రాచలంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

దారిపొడవునా గులాబీ రక్షణ వలయం..

Advertisement

భద్రాచలం నుండి కౌన్సిలర్లను క్షేమంగా క్యాతనపల్లికి చేర్చేందుకు బాల్క సుమన్ ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. భద్రాచలం, మంగపేట, ములుగు, ఏటూరునాగారం, కాటారం, మరియు చెన్నూరు మీదుగా సాగే ప్రయాణంలో ఎక్కడా పోలీసులు లేదా ప్రత్యర్థి వర్గాలు అడ్డుకోకుండా ఆయా ప్రాంతాల బిఆర్ఎస్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ గులాబీ సైన్యం రహదారులపై పహారా కాస్తూ, కౌన్సిలర్ల వాహన శ్రేణికి రక్షణగా నిలిచింది. చివరకు కౌన్సిలర్లందరినీ చెన్నూరు నియోజకవర్గంలోని తన నివాసానికి సురక్షితంగా చేర్చారు.

దొడ్డిదారిన అధికార దాహంపై ధ్వజం..

ప్రస్తుతం బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా బిఆర్ఎస్ కార్యకర్తలు మొహరించారు. సోమవారం జరగనున్న చైర్మన్ ఎన్నికలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి దొడ్డిదారిన మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులతో దాడులు చేయించడం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. సోమవారం ఎన్నిక పూర్తయ్యే వరకు తమ కౌన్సిలర్లు ఐక్యంగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: Kishan Reddy: భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్!

Related News

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

Big Stories

Advertisement
×