Hyderabad : తాగుబోతు చేష్టలు ఎంత గమ్మత్తు అనిపిస్తాయో.. అంతే ప్రమాదకరంగానూ ఉంటాయి. మద్యం మత్తులో ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు కొందరు. తప్ప తాగి.. ఒళ్లు మరిచి.. తాము ఏం చేస్తున్నామో కూడా మరిచిపోతుంటారు. ఆ మధ్య ఒకతను కరెంట్ తీగలపై పడుకున్న ఘటన తెగ టెన్షన్ పెట్టింది. అలాంటిదే మరో సంఘటన లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో జరిగింది.
గాల్లో ప్రాణాలు అంటే వినడమే కానీ చూడటం అరుదు. కానీ, ఓ మందుబాబు అదే పని చేశాడు. ఫుల్‌గా తాగినట్టున్నాడు. ఫ్లైవోవర్ ఎక్కాడు. పక్కనే కేబుల్ వైర్లు ఉన్నాయి. మద్యం మత్తులో ఫ్లైఓవర్ నుంచి ఆ వైర్లను పట్టుకుని ఊగాడు. ఇక అంతే. పైకి పోలేడు. కింద పడలేడు. గాల్లో అలా వేలాడాడు.
గాల్లో మందుబాబు ఊగిసలాట..
కింద చూస్తే రోడ్డు. అంతెత్తు నుంచి పడ్డాడంటే తల పగిలిపోద్ది. అలాగని మళ్లీ ఫ్లైఓవర్ మీదకూ ఎక్కే పరిస్థితి లేదు. అలా భూమి, ఆకాశం మధ్యలో అతని ప్రాణాలు ఊగిసలాడుతున్నాయి. అప్పటికే తాగిందంతా దిగేసింది. మనోడికి భయం మొదలైంది. గట్టిగా అరవడం మొదలుపెట్టాడు.
ఆ ఐడియా అతన్ని కాపాడింది..
అతని అరుపులు విని స్థానికులు స్పందించారు. కొందరు పోలీసులకు కబురు పెట్టారు. కానీ, వాళ్లు వచ్చే వరకు ఆ తాగుబోతు అలా గాల్లో వేలాడుతూ ఉండాలిగా. పడితే.. తల పుచ్చకాయలా పగిలిపోద్ది మరి. ఎంత సేపు అని అలా వేలాడగలడు? పాపం అనుకున్నారు అక్కడున్న వాళ్లు. ఆ మందుబాబును ఎలాగైనా కాపాడాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. నిచ్చెన వేసి కాపాడే సీన్ లేదక్కడ. కర్రపెట్టి ఫ్లైఓవర్ మీదకూ లాగేయలేరు. గాల్లో ఉన్నాడు. పడితే కిందే పడాలి. వేరే ఆప్షన్ లేదు. అప్పుడే వాళ్లకో బంపర్ ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఆ మందుబాబు జీవితాన్ని మార్చేసింది. అదేంటంటే..
కారు కవర్‌తో..
అక్కడే ఓ కారుకు ఎండ తగలకుండా కవర్ కప్పి ఉండటం చూశారు. వెంటనే ఆ కారుకు కప్పిన కవర్ తీసేశారు. ఆ కవర్‌ను వల మాదిరి ఓ 10 మంది గట్టిగా పట్టుకున్నారు. సరిగ్గా ఆ మందుబాబు కింద పడే ప్లేస్‌లో నెట్‌లా కవర్‌తో కవర్ చేశారు. ఇంకేం.. దూకేయ్ దూకేయ్ అంటూ కిందినుంచి డైరెక్షన్ ఇచ్చారు.
Also Read : అఘోరీ అరెస్ట్.. వర్షిణి పరిస్థితేంటి?
అలా బతికిపోయాడు..
ఆ మందుబాబు ఇంకా భయంలోనే ఉన్నాడు. దూకాలా వద్దా? దూకితే ఆ కవర్ తనను ఆపుతుందా లేదా? అంటూ కాసేపు డౌట్ పడ్డట్టున్నాడు. కానీ, అతనికి వేరే ఛాన్స్ లేకుండా పోయింది. పట్టుకున్న వైర్‌ను వదిలేసి.. కిందకు దూకేయడం మినహా చేసేదేమీ లేదు. ఇక తప్పదన్నట్టు.. వన్ ఫైన్ మూమెంట్.. అతను వైరు వదిలేశాడు. పర్‌ఫెక్ట్‌గా.. ఆ 10 మంది కలిసి గట్టిగా పట్టుకున్న కవర్‌లో పడ్డాడు. అలా బతికిపోయాడు. ఆ తాగుబోతు చేసిన పనికి తలా ఒక్కటిచ్చారు అక్కడ చేరిన వాళ్లంతా. పోలీసులు, ఫైర్ సిబ్బంది మాదిరి.. ప్రొఫెషనల్‌గా పని చేసిన ఆ స్థానికులను అంతా అభినందిస్తున్నారు. ఇదంతా హైదరాబాద్, అత్తాపూర్‌లోని పిల్లర్ నెంబర్ 100 దగ్గర జరిగింది. సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
#Hyderabad: Drunk Man Hangs from Wire at Attapur Pillar NO: 100, Locals Save Him with a Car Cover.#Hyderabadnews#Telangana #attapur #BreakingNews pic.twitter.com/i7yVhy3hLO
— Zaffer Abedi (@zaffer_abedi) April 21, 2025