E-Paper
Advertisement

లాల్ దర్వాజాలో బోనాల సందడి..అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు!

లాల్ దర్వాజాలో బోనాల సందడి..అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు!
Advertisement

Lal Darwaza Bonalu 2026: హైదరాబాద్ నగరం మరోసారి ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, భాగ్యనగరం బోనాల జాతరతో సందడిగా మారుతుంది. ముఖ్యంగా నేడు ఓల్డ్ సిటీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

భాగ్యనగరంలో బోనాల సందడి:
ఆషాఢ బోనాలు అంటేనే భాగ్యనగరానికి పండగ. ఈ ఏటా ఆషాఢ బోనాల సంబరాలు కన్నుల పండగగా మొదలయ్యాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. తెల్లవారుజామునే 4:30 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి.

Advertisement

ఈ ఏడాది లాల్ దర్వాజా బోనాలకు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. బోనాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులు, పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆరు క్యూలైన్లు ఏర్పాటు కూడా చేశారు. బోనాలు సమర్పించే వారికి ప్రత్యేక క్యూలైన్ కేటాయించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కొనసాగుతున్నాయి.

ప్రముఖుల సందడి:
అమ్మవారిని దర్శించుకోవడానికి రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. మంత్రి సీతక్క, ఎంపీ అనిల్ యాదవ్ తో పాటు ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు పట్టువస్త్రాలు సమర్పించగా.. ఆ తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Advertisement

హీరో విజయ్ దేవరకొండ:
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.  ఆలయానికి విచ్చేసిన విజయ్ దేవరకొండ, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తమ్ముడు ఆనంద్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నారు.

భద్రత ఏర్పాట్లు:
భక్తుల అసౌకర్యం కలగకుండా  పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. 100 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. సుమారు 2500 మంది భారీ పోలీసు బలగాలతో బందోబస్తు  కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సదుపాయాల ఆలయ ప్రాంగణంలోనే అందుబాటులో ఉన్నాయి. ఎండ వేడి నుంచి ఉపశమనానికి భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

నేటి కార్యక్రమాలు:
ఉదయం నుంచి రాత్రి 10:30 గంటల వరకు భక్తులు బోనాలు, ఒడిబియ్యం, చీర, సారె సమర్పించుకుంటారు. సాయంత్రం అమ్మవారికి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. లాల్ దర్వాజాతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న దాదాపు మూడు వేల చిన్న చిన్న ఆలయాల్లో కూడా భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు జరుపుకుంటున్నారు.

Related News

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్, తలసాని

హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్.. నేడు-రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్లు పూర్తిగా క్లోజ్!

యువతకు కాంగ్రెస్ ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా.. సర్కార్ పై రాంచందర్ రావు ఫైర్!

క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఈవెంట్‌లో.. యువతకు మంత్రి వివేక్ కీలక సందేశం!

ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు ఫిట్స్.. స్పాట్‌లో ప్రయాణికులు..!

రెంట్ ఆన్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కొత్త సైబర్ స్కామ్.. యువతను అలర్ట్ చేసిన సీపీ సజ్జనార్!

తెలంగాణలో ఇందిరమ్మ ఇడ్ల పై బిగ్ అప్‌డేట్.. తొలి విడత లాటరీ తేదీలు ఇవే!

Big Stories

Advertisement
×