Big Stories

Last Day of Medaram Jatara: తిరుగువారంతో మేడారం జాతర ముగింపు.. పెరిగిన భక్తుల రద్దీ..

Sammakka Sarakka Jatara updates

- Advertisement -

Last day of Sammakka Sarakka Jatara(Local news telangana) : ఆతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం నిర్వహించే తిరుగువారంతో జాతర ముగుస్తోంది. ఈ తిరుగువారం కార్యక్రమానకి అధికారులు, పూజార్లు అన్ని ఏర్పాట్లు చేశారు. పూజారులు పూజా మందిరాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పూజారులు వాటికి తాళాం వేస్తారు.

- Advertisement -

మండమెలిగే పండుగతో మొదలైన సమ్మక్క సారలమ్మ జాతర తిరుగువారంతో ముగుస్తుంది. మళ్లీ వచ్చే ఏడాది మినీ జాతర సందర్భంగా ఈ సామగ్రిని బయటకు తీసి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తుల రద్దీ పెరిగింది. దాదాపు కోటిన్నర మంది దర్శించుకున్నారు అని సమాచారం. బుధవారం పూజలందుకున్న దేవతలు.. తిరుగువారం చేయడంలో జాతర ముగుస్తుంది.

Read More: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

నాలుగు రోజుల్లో కోటి 45 లక్షల మంది మేడారం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో ముగుస్తుంది. వన దేవతలు గద్దెలు విడిచే సమయంలో వర్షం కురవడం ఈ జాతర విశేషం. దీంతో ప్రజలు శుభ సూచకంగా భావిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News