E-Paper
Advertisement

Farmhouse Case: తనకేం తెలీదన్న శ్రీనివాస్.. ముగ్గురు నిందితుల కస్టడీకి సిట్ పిటిషన్

Farmhouse Case: తనకేం తెలీదన్న శ్రీనివాస్.. ముగ్గురు నిందితుల కస్టడీకి సిట్ పిటిషన్
Advertisement

Farmhouse Case: ఫాంహౌజ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతోంది. బండి సంజయ్ అనుచరుడైన అడ్వకేట్ శ్రీనివాస్ ను రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది. మరోవైపు, ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ స్పెషల్ కోర్టును ఆశ్రయించింది సిట్.

రెండు రోజులుగా న్యాయవాది శ్రీనివాస్ ను ఎంతగా ప్రశ్నించినా ఆయన ఒకే ఆన్సర్ చెప్పినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. గతంలో తనకోసం పూజలు చేసిన సింహయాజులపై ఉన్న అభిమానంతోనే ఆయనకు విమాన టికెట్ బుక్ చేశానని.. రాజకీయ కోణం ఏమీ లేదని చెప్పారు.

Advertisement

విచారణ తర్వాత శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బీజేపీతో గానీ, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎప్పుడు పిలిచినా వస్తానని.. సిట్‌ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

మరోవైపు, ఫాంహౌజ్ కేసులోు ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే నిందితులను రెండ్రోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ సరైన సమాచారం రాలేదని.. అందుకే మరో వారం రోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. పిటిషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఏసీబీ స్పెషల్ కోర్టు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×