Big Stories

Liquor Price: మందు రేట్ తగ్గిందోచ్.. ఎంత తగ్గిందంటే…

Liquor Price: మందు రేట్ పెంచడమే కానీ తగ్గించినట్టు చరిత్రలోనే లేదు. కానీ, మహానుభావుడు సీఎం కేసీఆర్ మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పారు. లిక్కర్ రేట్ తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో మద్యం ధరలు తగ్గాయ్. ఫుల్‌ బాటిల్‌పై రూ.40 తగ్గింది. హాఫ్‌ బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 తగ్గించింది. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60 వరకు తగ్గించింది సర్కార్. అయితే, గుడ్‌న్యూస్‌లో ఓ బ్యాడ్‌న్యూస్ కూడా ఉంది. బీర్ రేట్ మాత్రం తగ్గించకుండా అలానే ఉంచేసింది. ధరల తగ్గింపు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

ఇంతకీ, పెంచడమే కానీ తగ్గించే అలవాటు లేని సర్కారు.. సడెన్‌గా మద్యంపై ఎక్సైజ్ సుంకం ఎందుకు తగ్గించినట్టు? ఇదే ఆసక్తికర విషయం. అసలే ఖజానాలో డబ్బులు లేక భూములు, రోడ్లు అమ్ముకుంటోందనే విమర్శ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. మరి, రాబడి పెంచుకునేందకు పన్నులు పెంచే సర్కార్.. వెరైటీగా కాసుల గలగల వినిపించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంలో ఏదో మతలబు ఉండే ఉంటుందని అంటున్నారు.

పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో లిక్కర్ రేట్ ఎక్కువగా ఉందని.. అందువల్ల అక్రమంగా సరుకు రాష్ట్రంలోకి వస్తున్నట్టు గుర్తించి.. ఆ అక్రమ దందాను అడ్డుకోవడానికే మద్యం ధరలు తగ్గించామని చెబుతోంది. ఆబ్కారీ శాఖ చెబుతున్న రీజన్ కాస్త వెటకారంగా ఉంది. తెలంగాణకంటే ఏపీలో మందు రేట్లు భారీగా ఉన్నాయని.. అక్కడి వాళ్లే ఇక్కడికి వచ్చి తాగుతున్నారనేది అందరికీ తెలిసిందే. మరి, ప్రభుత్వం చెబుతోంది కర్నాటక, మహారాష్ట్ర, చత్తీష్‌గడ్ గురించా? లేదంటే.. ఎన్నికల సీజన్ వస్తోందిగా.. మందుబాబుల మద్దతు కోసం ఇలా రేట్లు తగ్గించిందా? అనే డౌటనుమానమూ లేకపోలేదు. కారణం ఏదైనా.. మందు రేట్ తగ్గింది.. అదే చాలు. కాస్త బీర్ రేట్ కూడా తగ్గించండి కేసీఆర్ సారూ…అంటున్నారు. ఇకపై ప్రభుత్వ ఆఫీసుల్లో మాదిరే.. వైన్స్, బార్స్‌లో సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News