Telangana News : అనగనగా ఓ ఆలయం. గుట్ట రాజరాజేశ్వర స్వామి కొలువున్న దేవాలయం. చిన్న గుట్టపై ఉంటుంది. మెట్లు ఎక్కి గుడికి చేరితే.. ప్రశాంతమైన వాతావరణం. స్వామి దర్శనంతో పాటు ప్రకృతి రమణీయతను కూడా చూడొచ్చు. స్థానికంగా పాపులర్ టెంపుల్ ఇది. నిత్యం భక్తులు వస్తుంటారు. వీకెండ్స్ రద్దీగా ఉంటుంది. అలాంటి ఆలయానికి తాళం వేశాడు ధర్మకర్త. గుడి నాదే.. దేవుడు నావాడే.. అంటూ పూజారిని లోనికి రానీయకుండా అడ్డుకుంటున్నాడు. ధర్మకర్త వేధింపులు తాళలేక.. తాళం వేసి ఉన్న గేటు ముందే దూపదీప నైవేధ్యాలు పెట్టేసి వెళ్లిపోతున్నాడు ఆ అర్చకుడు. తనకు న్యాయం చేయకపోతే.. అదే గుడి ముందు ఉరి వేసుకుని చనిపోతానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏంటంటే.. ఆలయ పూజారి, ధర్మకర్త ఇద్దరూ బ్రదర్స్.
అన్నదమ్ముల సవాల్.. గుళ్లో కోల్డ్‌వార్
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉంటుంది గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయం. 40 ఏళ్లుగా నిరంజన్ అర్చకుడిగా ఉన్నారు. ఆయన సోదరుడు జగదీశ్వర్ ఆ టెంపుల్‌కు ధర్మకర్తగా ఉంటున్నారు. ఇన్నేళ్లూ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అంతా సాఫీగానే సాగింది. భక్తులు కూడా సంతృప్తిగానే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఆ బ్రదర్స్ మధ్య విభేదాలు వచ్చాయి. అన్నదమ్ములు గొడవ పడ్డారు. అదేదో ఫ్యామిలీ ఫైట్ వరకూ పరిమితమైతే అది వేరేలా ఉండేది. కానీ, ఆ లొల్లి.. గుళ్లోకి వచ్చింది. తాను ధర్మకర్తగా ఉన్న ఆలయంలో నువ్వు అర్చకుడిగా ఉండటానికి వీళ్లేదంటూ జగదీశ్వర్.. సోదరుడిని అడ్డుకున్నాడు. పూజారి పోస్ట్ నుంచి తొలగించానని.. నువ్విక గుడికి రావాల్సిన అవసరం లేదని ఆదేశించాడు. కానీ, అర్చకుడు నిరంజన్ అందుకు ఒప్పుకోలేదు. పూజారి పోస్ట్ ఒకరు ఇస్తే తీసుకునేది కాదని.. తీసేస్తే ఊడిపోయేది కాదని.. నేనే పూజారి అంటూ పట్టుబట్టి గుడికి వస్తున్నాడు. అలా కొన్నాళ్లుగా సాగుతోంది ఆ ఆధిపత్య పోరు.
గుడికి తాళం.. ఇదేం దారుణం?
కట్ చేస్తే.. తాజాగా ధర్మకర్త జగదీశ్వర్ ఓవరాక్షన్ చేశాడు. ఎలాగైనా అర్చకుడిని గుళ్లోకి రానీయకుండా చెక్ పెట్టాలని స్కెచ్ వేశాడు. రావొద్దన్నా వస్తున్నాడు కాబట్టి.. ఈసారి ఏకంగా గుడికే తాళం వేశాడు. ఆలయ ప్రధాన ద్వారంకు లాక్ చేశాడు. దీంతో.. ఆ ఇద్దరి మధ్య వివాదం ఇప్పుడు రోడ్డుకెక్కింది. రచ్చ రచ్చ అవుతోంది.
Also Read : అఘోరీ మొదటి భార్య ఎంట్రీ.. వర్షిణి పరిస్థితేంటి?
గుడి ముందు పూజారి ఆందోళన
అర్చకుడు నిరంజన్ తాళం వేసి ఉన్న గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపాడు. గేటు ముందే.. పూజ చేసి, దీపదీప నైవేధ్యాలు అక్కడే ఉంచి ఆందోళన చేపట్టాడు. తన సోదరుడు జగదీశ్వర్‌ను ధర్మకర్త బాధ్యతల నుంచి రెండేళ్ల క్రితమే తొలగించారని.. అయినా ఇంకా తనపై, ఆలయంపై పెత్తనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. ఆయనకు ఓ రాజకీయ పార్టీ సపోర్ట్ ఉందని చెబుతున్నాడు. తన అర్చకత్వ సర్టిఫికెట్లు, ఆ ఆలయానికి అర్చకుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీలను మీడియాకు చూపించి న్యాయం చేయాలని అడుగుతున్నారు. తనను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకుంటే.. గేటు దగ్గరే ఉరి వేసుకుని చనిపోతానని హెచ్చరిస్తున్నాడు. ధర్మకర్త, పూజారి కోల్డ్ వార్‌తో గుడికి తాళం వేసి ఉండటంతో.. స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.