BigTV English

Trivikram : ఆర్డర్ తప్పుతున్న గురూజీ.. ఆ నలుగురిని కాదని వేరే హీరోతో సినిమా..

Trivikram : ఆర్డర్ తప్పుతున్న గురూజీ.. ఆ నలుగురిని కాదని వేరే హీరోతో సినిమా..

Trivikram : టాలీవుడ్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ఆయన సినిమా అంటేనే, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, యూత్ కూడా ఇష్టపడతారు. ఆయన సినిమాల్లో ప్రతి సన్నివేశం అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. నువ్వే నువ్వే సినిమా నుండి మొన్న వచ్చిన గుంటూరు కారం వరకు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్స్. ఆయన రచన శైలి సాధారణ ప్రేక్షకుడికి మనసుకు హద్దుకునేలా ఉంటాయి. గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఏ హీరోతో తీయబోతున్నారని ఇప్పటివరకు చెప్పలేదు. అయితే అల్లు అర్జున్ తో ఒక సినిమా ఓకే చెప్పారు. తాజాగా అయిన అల్లు అర్జున్ తో కాకుండా మరో టాప్ హీరోతో సినిమా చేస్తున్నారన్న టాక్.. అసలు ఎవరా హీరో.. చూసేద్దాం..


గురూజీ హీరోతో సినిమా చేస్తున్నారా ..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ హీరోగా ఇప్పటివరకు ఏ సినిమా తీయలేదు. వీరి కాంబోలో సినిమా చేస్తే బాగుంటుందని మూవీ లవర్స్ కోరుతున్నారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేశారు. కానీ ఫుల్ లెన్త్ సినిమా ఇప్పటివరకు వీరి కాంబోలో రాలేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత వెంకటేష్ ఏ సినిమా ప్రకటించలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు అన్న వార్త వచ్చింది. బన్నీ తో ఒక సినిమా చేయాలని, అనుకున్న బన్నీ, అట్లీ మూవీ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు సమాచారం. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, లాంటి బడా హీరోలని కాదని, ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఏది ఏమైనా వీరి జోనర్ లో సినిమా రావడం, వెంకటేష్ లాంటి హీరో, త్రివిక్రమ్ తో జతకట్టడం టాలీవుడ్ లో మరో సూపర్ హిట్ పడడం ఖాయం అంటున్నారు అభిమానులు.


ఆర్డర్ తప్పుతున్న గురూజీ ..

ఇక త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాతో సక్సెస్ ని అందుకున్నారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన అతడు,ఖలేజా తరువాత ఈ సినిమా ఇండస్ట్రీలో డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇప్పుడు వెంకీకి కథ చెప్పినట్లు, ఆయన ఓకే చెప్తే ఇక సినిమా మొదలు పెడతారు అన్న టాక్. ఇది కూడా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుందని త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్లు సమాచారం.వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తారని అనుకున్న గురూజీ ఇప్పుడు ఆర్డర్ తప్పుతున్నారని, ఆ నలుగురిని కాదని ఈ హీరోతో సినిమా చేయడం కలిసొస్తుందా రాదా అని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

Kesari Chapter 2 First Review : కేసరి చాప్టర్ 2పై రానా ఫస్ట్ రివ్యూ… హిస్టరీ క్రియేట్ అంటూ.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×