Chandra Grahan-2025: ప్రపంచవ్యాప్తంగా చంద్ర గ్రహణం-2025 ముగిసింది. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు రెడ్ కలర్‌లోకి మారాడు. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు గ్రహణం ప్రారంభమైంది. అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక గ్రహణం వీడింది. వినువీధిలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది.
చల్లగా వెలుగులు పంచే ఆ చందమామ గ్రహణం కారణంగా ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేశాడు. ఆయా దృశ్యాలను ప్రపంచవ్యాప్తంగా వీక్షించారు ప్రజలు. పలు దేశాల్లో సంపూర్ణంగా కనిపించగా, మరికొన్ని ఖండాల్లో పాక్షికంగా కనిపించింది. ఆదివారం చంద్రుడు పూర్తిగా భూమి నీడన 82 నిమిషాల పాటు ఉన్నాడు.
భారత్‌లో ఆదివారం రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా బ్లడ్ మూన్ కనిపించడం మొదలైంది. సంపూర్ణ చంద్ర గ్రహణం రాత్రి 11 గంటల ఒక నిమిషానికి మొదలైంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి మూతబడ్డ ఆలయాలు తెరుచుకున్నాయి.
తెల్లవారుజామున మూడు గంటలకు దేశంలోని ప్రధాన ఆలయాలు తెరచుకున్నాయి. ఆలయ సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ, జోగులాంబ, కొండగట్టుతో పాటు అయోధ్య రామాలయం, మథుర, కేదార్నాథ్, బద్రీనాథ్ తిరిగి సోమారం ఉదయం భక్తులను అనుమతించారు.
ALSO READ: గణేశోత్సవంలో షాకింగ్ ఘటన.. లడ్డూ ధర కేవలం రూ.99
గ్రహణ సమయంలో రాత్రి 11 గంటలకు తెరిచి గ్రహణకాల అభిషేకాలు, శాంతి పూజలు చేపట్టారు. గ్రహణం తర్వాత దూప, దీప నైవేథ్యాలు మొదలయ్యాయి. గ్రహణం వీడిన తర్వాత భక్తులు ఈ విషయాలు తెలుసుకోవాలని. చంద్రుడి సంబంధించిన వ్యవహారం కావడంతో తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా మంచిది.
స్నానాలు చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని చేయాలి. అప్పుడే దానికి ఫలితం వస్తుంది. పుణ్యం కావాలంటే చేసే ప్రక్రియను భగవంతుడితో మమేకం అయి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత పాలు, బియ్యం, చక్కెర వంటివి అవసరమైన వారికి దానం చేయాలి. ఎప్పుడూ చేసే దానాల కంటే గ్రహణ సమయంలో చేసే దానాలు వెయ్యి రెట్లు మంచి ఫలితం ఇస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇంటిలో దేవుని మందిరాన్ని గ్రహణం తర్వాత పసుపు నీళ్లు సంప్రోక్షణ తప్పకుండా చేయాలి. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణ కాగా కనిపించింది. ఇక ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షికంగా చంద్ర గ్రహణం కనిపించింది.
సంపూర్ణ చంద్రగ్రహణం దృశ్యాలు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ముగిసిన చంద్రగ్రహణం
దాదాపు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉన్న చంద్రుడు
భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక వీడిన గ్రహణం
ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ.. ఐరోపా,… pic.twitter.com/pYdtoXKmH9
— BIG TV Breaking News (@bigtvtelugu) September 8, 2025