Farmers Protest: ప్రభుత్వంలో ఉంటే మా భూములు లాక్కుంటారు.. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి.. రైతులకు అన్యాయమంటారా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను తీసుకొనేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిందన్న విషయం తెలుసుకోండి కేటీఆర్ గారూ.. మీలాగా దౌర్జన్యం చేయలేదు.. భూములు లాక్కోను కూడా లేదు.. దయచేసి మా జిల్లాకు రావద్దు కేటీఆర్.. గో బ్యాక్ కేటీఆర్ గో బ్యాక్.. అంటూ ఆ జిల్లా రైతులు ప్లెక్సీలతో కేటీఆర్ కు భారీ షాకిచ్చారు.
గత బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ రైతుల వద్ద, దౌర్జన్యంగా భూములు లాక్కున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు సంఘీభావ పేరుతో కేటీఆర్ మహబూబాబాద్ వస్తున్నసందర్భంగా అంబేద్కర్ సెంటర్లో రైతులు భారీ ఫ్లెక్సీలను కేటీఆర్ గో బ్యాక్ అంటూ ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై రైతులు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత గిరిజన రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని, నాటి ప్రభుత్వంలో భూములు కోల్పోయిన రైతులందరూ కలిసి ప్రస్తుతం కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామన్నారు. రైతులకు సంబంధించిన సాగు భూములను ప్రభుత్వ కార్యాలయాల పేరుతో దౌర్జన్యంగా లాక్కొని, నాడు రైతులపై విధ్వంసానికి కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిందని రైతులు విమర్శించారు. అంతేకాకుండా నాడు అధికారంలో ఉన్న సమయంలో రైతుల పై అక్రమ కేసులు నమోదు చేశారని, ప్రస్తుతం అధికారం లేదు కాబట్టి రైతుల కోసం ధర్నా చేస్తున్నామంటూ ప్రకటించడం మాజీ మంత్రి కేటీఆర్, బీర్ఎస్ నాయకులకు చెల్లిందన్నారు.
Also Read: Lady Aghori: అఘోరీ నోట భవిష్యవాణి.. చుట్టుముట్టిన భక్తులు.. అసలేం చెబుతోందంటే?
అధికారంలో ఉన్న సమయంలో రైతుల కోసం ఒక్క పథకం ప్రవేశపెట్టలేదని, దళిత రైతులు తరతరాలుగా భూములు నమ్ముకుని వ్యవసాయం సాగిస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు అక్రమంగా భూములను లాక్కున్నట్లు వారు తెలిపారు. మహబూబాబాద్ కు రైతుల పేరుతో వస్తున్న కేటీఆర్ ను నాటి ప్రభుత్వంలో సాగు భూములు కోల్పోయిన రైతులందరూ తప్పక వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. కాగా రైతులు ఫ్లెక్సీలను మహబూబాబాద్ లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, కేటీఆర్ రాకపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి రైతుల ఈ ప్రకటనపై బీఆర్ఎస్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇలా ఓ వైపు రైతులు గో బ్యాక్ కేటీఆర్ అంటూ నిరసన తెలుపుతుంటే.. మరో వైపు కేటీఆర్ మాత్రం మహబూబాబాద్ ధర్నాకు అనుమతి ఇవ్వరా అంటూ ట్వీట్ చేశారు. ప్రతిసారీ కేసీఆర్ రావాలని అంటుంటారు కానీ ధర్నాకు మాత్రం అనుమతి ఇవ్వరా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
కేటీఆర్ గోబ్యాక్ అంటూ మానుకోట రైతుల నిరసన
కేటీఆర్ మహబూబాబాద్ రాకుండా అడ్డుకుంటామన్న రైతులు
గత ప్రభుత్వంలో కార్యాలయాల పేరుతో ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపణ
ఇప్పుడు రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం సిగ్గుచేటని మండిపడిన రైతులు… pic.twitter.com/mBfpF9d9pM
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2024