BigTV English

3X Refund – Train Ticket: ఇకపై మీ ట్రైన్ టికెట్ 100% కన్ఫార్మ్.. లేదంటే 3 రెట్లు డబ్బు వెనక్కి!

3X Refund – Train Ticket: ఇకపై మీ ట్రైన్ టికెట్ 100% కన్ఫార్మ్.. లేదంటే 3 రెట్లు డబ్బు వెనక్కి!

Indian Railways: రోజూ కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. రైలు ప్రయాణం చేసే వారిలో చాలా మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, రద్దీ సమయాల్లో టికెట్ల బుకింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. ఒక్కోసారి టికెట్లు బుక్ చేసుకున్నా, కన్ఫార్మ్ అవుతాయనే గ్యారెంటీ ఉండదు. చార్ట్ ప్రిపేర్ సమయంలో టికెట్ క్యాన్సిల్ అయితే, ముందుగా అనుకున్న టూర్ ప్లాన్ మొత్తం గందరగోళంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నూటికి నూరుశాతం టికెట్ కన్ఫార్మ్ అయ్యే పద్దతి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


టికెట్లు బుక్ కాకపోతే 3 రెట్లు డబ్బు వెనక్కి

చాలా మంది రకరకాల పద్దతుల ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకుంటారు. ఒక్కోసారి పరిమితికి మించి టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్టులో ఉంటుంది. చార్ట్ ప్రిపేర్ సమయంలో చాలా టికెట్లు ఎగిరిపోతాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా మేక్ మై ట్రిప్ కచ్చితంగా టికెట్లు కన్ఫార్మ్ అయ్యే పద్దతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు, టికెట్లు బుక్ కాకపోతే మూడు రెట్లు డబ్బు తిరిగి వెనక్కి ఇస్తుంది.


Read Also : రైల్లో వాటర్ బాటిల్ అలా అమ్ముతున్నారా? వెంటనే ఇలా కంప్లైట్ చేయండి !

100% టికెట్లు కన్ఫార్మ్..  

కచ్చితంగా కన్ఫార్మ్ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ క్రింది స్టెప్స్ ఫాలోకండి…

⦿ ముందుగా మీ మోబైల్ లేదంటే కంప్యూటర్ గూగుల్ ఓపెన్ చేయాలి.

⦿ మేక్ మై ట్రిప్ అని టైప్ చేయాలి. సైట్ ఓపెన్ చేయాలి.

⦿ వెబ్ సైట్ హోమ్ పేజీలో ట్రైన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

⦿ ఆ తర్వాత బుక్ ట్రైన్ టికెట్ ను ట్యాప్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేయాలి.

⦿ మీరు వెళ్లాల్సిన రూట్ లో ఉన్న ట్రైన్స్ లిస్టు కనిపిస్తుంది.

⦿ ఆ ట్రైన్స్ లో కొన్నింటికి ‘ట్రిప్ గ్యారెంటీ’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వాటిని మాత్రమే క్లిక్ చేయాలి.

⦿ ‘ట్రిప్ గ్యారెంటీ’ ఉన్న ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి.. అవి RACలో ఉన్నా, వెయిటింగ్ లిస్టులో ఉన్నా.. చార్ట్ ప్రిపేర్ అయ్యేలోగా కచ్చితంగా టికెట్లు కన్ఫార్మ్ అవుతాయి.

⦿ ఒకవేళ మీ టికెట్లు కన్ఫార్మ్ కాకపోతే మీరు ఎన్ని డబ్బులు చెల్లించారో, దానికి మూడు రెట్లు వెనక్కి ఇస్తారు.

సో, ఇకపై టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ టిప్ ను ఫాలో అయిపోండి. టికెట్లు కన్ఫార్మ్ కాలేదనే టెన్షన్ ఉండదు. ఒకవేళ టికెట్లు కన్ఫార్మ్ కాకపోయినా మూడు రెట్లు డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. రెండు రకాలుగా లాభం కలుగుతుంది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి.  పక్కా టికెట్ల బుకింగ్ కోసం సాయం చేయండి.

Read Also : కాశ్మీర్‌కు నేరుగా వందే భారత్ రైలు.. మొదలయ్యేది అప్పటి నుంచే, టికెట్ బుకింగ్స్‌ కు రెడీ అవ్వండి !

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×