E-Paper
Advertisement

సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!

సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!
Advertisement

BRS Surveys: స్వేచ్ఛ బ్యూరో: ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేశాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటు, రెండు‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై బీఆర్ఎస్‌ పార్టీ అంతర్గతంగా సర్వేలు ప్రారంభించినట్లు సమాచారం. పార్టీ యంత్రాంగం ద్వారా సేకరిస్తున్న సమాచారంతో పాటు ప్రైవేటు సంస్థల సహకారంతోనూ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అనుకూలత ఎంత? ఎక్కడ బలం ఉంది? ఎక్కడ బలహీనతలు ఉన్నాయి? పోటీకి దిగే అభ్యర్థుల్లో ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అనే అంశాలపై పూర్తి వివరాలను తెచ్చుకుంటున్నట్లు సమాచారం.

నియోజకవర్గాల వారీగా బృందాలు

Advertisement

ఉప ఎన్నికల్లో ఓటర్ల స్వరూపం, స్థానిక రాజకీయ పరిస్థితులు కీలకం కావడంతో పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం డివిజన్లవారీగా బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.స్థానికంగా పార్టీ పరిస్థితి, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల తీరు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీల బలం, ప్రభావం చూపగల నాయకులు, ఆశావహుల సామర్థ్యం తదితర అంశాలను బృందాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీల స్థానంలో ఓటర్లుగా ఉండే ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, విద్యావంతుల్లో పార్టీ పట్ల ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడంపైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలు, విద్యా రంగానికి సంబంధించిన సమస్యలు, యువతలో ఉన్న అసంతృప్తి లేదా సానుకూలత వంటి అంశాలను సర్వేల్లో ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.

ప్రైవేటు సంస్థలతోనూ సర్వేలు?

Advertisement

పార్టీ అంతర్గతంగా నిర్వహిస్తున్న సర్వేలతో పాటు ప్రైవేటు సంస్థల ద్వారా స్వతంత్రంగా సమాచారం సేకరించే అంశంపైనా దృష్టి పెట్టినట్లు సమాచారం. రెండు వేర్వేరు మార్గాల్లో వచ్చే అభిప్రాయాలను పోల్చి చూసి క్షేత్రస్థాయి పరిస్థితిపై అంచనాకు రావాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక నేతలు ఇచ్చే సమాచారం, పార్టీ శ్రేణుల నివేదికలు, స్వతంత్ర సర్వేల ఫలితాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సర్వేనే ప్రాతిపదిక అభ్యర్థుల ఎంపిక?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలన్న విషయంలోనూ సర్వే ఫలితాలు కీలకంగా మారే అవకాశముంది. టికెట్‌ ఆశిస్తున్న నాయకుల రాజకీయ నేపథ్యం, ప్రజల్లో గుర్తింపు, క్షేత్రస్థాయిలో అందుబాటు, వివిధ వర్గాలతో సంబంధాలు, ఎన్నికల నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. ఆశావహుల ఉండటంతో సర్వే ఫలితాలను ఒక ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.అయితే కేవలం సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారా? లేక సామాజిక సమీకరణాలు, పార్టీకి ఉన్న స్థానిక బలం, ఇతర పార్టీల వ్యూహాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది తుది నిర్ణయ సమయంలో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఓటరు నమోదుపై నేతలకు బాధ్యతలు

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియపైనా బీఆర్ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు అయ్యేలా పార్టీ నేతలకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది.6 ఉమ్మడి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అర్హులైన ఓటర్లను గుర్తించడం, వారికి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడం, అవసరమైన సమాచారాన్ని అందించడం వంటి కార్యక్రమాలపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసింది.క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా, కొత్త ఓటర్లు, ప్రాంతాల వారీగా ఓటర్ల స్వరూపం వంటి అంశాలను పార్టీ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వ్యూహంలో భాగంగానే..

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే సర్వేలు, ఓటరు నమోదు, ఆశావాహులపై సమాచార సేకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్‌ ముందస్తు వ్యూహానికి పదును పెడుతున్నది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం వంటి అంశాలపై హడావుడి లేకుండా ముందుగానే క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక, నల్లగొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీకి ఉన్న అవకాశాలపై సర్వేలు పూర్తయిన తర్వాత మరింత స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సర్వే నివేదికలు, ఓటరు నమోదు పరిస్థితి, స్థానిక నాయకుల పనితీరు, ఆశావహుల బలాబలాలను సమీక్షించిన అనంతరం అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: నాగోల్‌లో దారుణం.. నడిరోడ్డుపై కాళ్లు, చేతులు లేని మహిళ మృతదేహం!

Tags

Related News

8. జెప్టో డెలివరీ కార్మికుడిపై దాడి.. చర్యలకు TGPWU డిమాండ్

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా మార్పులు.. జీహెచ్‌ఎంసీ మరో బిగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం.. నల్గొండలో 80 శాతం పత్తిపంట నష్టం!

ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరుతో భూ కబ్జా.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు!

నాగోల్‌లో దారుణం.. నడిరోడ్డుపై కాళ్లు, చేతులు లేని మహిళ మృతదేహం!

Big Stories

Advertisement
×