Rajireddy : మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూరు. ఆయన సంగ్రామ్ పేరుతో మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 70 ఏళ్ల రాజిరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజిరెడ్డి దండకారణ్యంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పేర్కొంటూ మావోయిస్టులు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు.
రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఆయన తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరిగా ఉన్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు. దళంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజిరెడ్డిని పట్టుకుంటే రూ.కోటి ఇస్తామని గతంలోనే ప్రభుత్వం నజరానా ప్రకటించింది.
దక్షిణ భారత్ దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం పెంచడానికి రాజిరెడ్డి కృషి చేశారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో ఇన్‌ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించారు. విప్లవాత్మక ఉద్యమాన్ని ముందుకు నడిపారు.