Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం దివాన్ దేవ్ డి ఏరియాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికీలలకు దాదాపు 40 టెక్స్‌టైల్ షాపుల్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. దాదాపు 10 ఫైర్ ఫైటర్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ఫైర్ సేఫ్టీ అధికారి చెబుతున్నారు.
ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఏడు ప్రాంతాల నుంచి ఏడు ఫైర్ ఇంజిన్స్ తెప్పించామన్నారు. మంటలను దాదాపుగా అదుపులోకి వచ్చాయని తెలిపారు. రెండు, మూడు ఫ్లోర్లలో మంటలు చెలరేగాయని తెలిపారు. ప్రమాదం సమయంలో లోపలకు వెళ్లడానికి వాతావరణం అనుకూలంగా లేదన్నారు. దానివల్ల కాస్త ఆలస్యమైందని ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చామన్నారు.
ఆస్తి నష్టం ఎంత ఉండవచ్చన్నది చెప్పలేమన్నారు. ఘటన చుట్టూ బట్టల షాపుల ఉండడంతో భారీగా ఉండవచ్చని కొందరు అధికారుల మాట. ప్రమాద ఘటనలపై విచారణ జరుగుతోందన్నారు. విచారణలో ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయాలపై స్పష్టత వస్తుందన్నారు.
ALSO READ: రంగరాజన్ దాడి కేసు, కీలక నిందితుడు అరెస్ట్, మరికొందరి కోసం గాలింపు
ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చు
ఏడు ప్రాంతాల నుంచి ఏడు ఫైర్ ఇంజిన్స్ తెప్పించాం
మంటలను దాదాపు అదుపు చేశాం
రెండు, మూడు ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి
లోపాలకి వెళ్లడానికి అనుకూలంగా లేదు
మంటలన్నీ ఆరిపోయాకే లోపలికి వెళ్లగలం
– ఫైర్ సేఫ్టీ అధికారి https://t.co/edaDxQSTTT pic.twitter.com/rRoTkJ4R8p
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025