Hyderabad News: హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అవి మిగతా ఇళ్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది?
ఎండాకాలం వస్తే చాలు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ఇళ్లలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని పదేపదే చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ విషయంలో ఎప్పుటికప్పుడు చెక్ చేసుకోవాలని చెబుతుంటారు. వంట చేసే సమయంలో తగినంత వెంటిలేషన్ ఉండేలా చూడాలని చెబుతున్నారు. తేడా వస్తే ఊహించని నష్టం జరుగుతుందని పదే పదే వెల్లడిస్తుంటారు.
టపాసుల మాదిరిగా గ్యాస్ సిలిండర్లు పేలిపోతాయని హెచ్చరించిన సందర్భాలు లేకపోలేదు. ప్రస్తుతం నాగోల్‌లోని సాయినగర్ కాలనీలో జరిగిందీ అదే. గుడిసెలు ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యింది. దాని తర్వాత మంటలు చెలరేగాయి. ఆ ఇంటి నుంచి మిగతా గుడిసెలకు వ్యాపించాయి. ఈలోగా అలర్టయిన స్థానికులు మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, బస్తీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అన్నట్లు పుష్కర కాలం కిందట ఈ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అంటున్నారు. బాధితుల నుంచి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. గుడిసెల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, గ్యాస్ లీకేజి లేకుండా చూసుకోవాలన్నది అధికారుల మాట.
ALSO READ: రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్‌డేట్స్, పెండింగ్‌లో ఆ దరఖాస్తులు?
భారీ అగ్నిప్రమాదం.. మంటలకు ఆహుతవుతున్న గుడిసెలు
నాగోల్‌లోని అలకాపురి సాయినగర్ కాలనీలో ఘటన
సిలిండర్ బ్లాస్ట్ అవ్వడమే అగ్నిప్రమాదానికి కారణమని సమాచారం
ఇప్పటికే 15 గుడిసెలకు వ్యాపించిన మంటలు
మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/iUd1gCBx38
— BIG TV Breaking News (@bigtvtelugu) May 6, 2025