E-Paper
Advertisement

Medaram Jatara 2026: మేడారంలో వనదేవతల మహోత్సవం.. భక్తుల కోలాహలం మధ్య వనంలోకి అమ్మవార్లు..!

Medaram Jatara 2026: మేడారంలో వనదేవతల మహోత్సవం.. భక్తుల కోలాహలం మధ్య వనంలోకి అమ్మవార్లు..!
Advertisement

Medaram Jatara 2026: స్వేఛ్చ బ్యూరో: ఈనెల 28 నుంచి 31 వరకు 2026 మేడారం మహా జాతర అత్యంత అద్భుతంగా, ఆధ్యాంతం ఆధ్యాత్మికంగా కొనసాగింది. సమ్మక్క సారలమ్మ జాతరను ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని శాశ్వత నిర్మాణ పనులతో పాటు, వనదేవతల గద్దెల పున ప్రతిష్ట కార్యక్రమం సైతం చేపట్టారు. దీంతో భక్తులకు దర్శనం చేసుకునేందుకు సులువుగా మారింది. నాలుగు రోజులపాటు భక్తులకు దర్శనమిచ్చిన వనదేవతలు శనివారం రాత్రి 7 గంటలకు మేడారంలోని గద్దెల ప్రాంతంలో ఆదివాసి గిరిజన అర్చకులు శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వనదేవతల వనప్రవేశానికి గిరిజన ఆదివాసీల సాంప్రదాయాలు, సాంస్కృతి పద్ధతుల ప్రకారం అంగరంగ వైభవంగా తీసుకెళ్లారు. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారంతో పాటు నాలుగు రోజులు భక్తులకు కోరిన కోరికలు తీర్చేందుకు వనదేవతలు ఆశీస్సులను అందించారు. వనదేవతలకు భక్తులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిలువెత్తు బంగారం, వడిబియ్యం, చీర, సారెలు సమర్పించి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. మళ్లీ రెండేళ్లకు వచ్చే అమ్మవార్లకు మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని భక్తులు కోరుకున్నారు.

ముగ్గురు ములుగు.. ఒకరు మహబూబాబాద్ జిల్లాకు..

మంగళవారం ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగడిద్దరాజు దేవాలయం నుంచి పెళ్లి కొడుకుగా ముస్తాబై ములుగు జిల్లా లక్ష్మీపురం లో మంగళవారం రాత్రి బస చేశారు. బుధవారం సారలమ్మ కన్నెపల్లి నుంచి, పగిడిద్దరాజు లక్ష్మీపురం నుంచి, గోవిందరాజు ఏటూర్ నాగారం కొండాయి గ్రామం నుంచి మేడారంలోని గద్దెలపైకి తీసుకొచ్చి ఆదివాసి ఆలయ పూజారులు ప్రతిష్టించారు. గురువారం ఆదివాసీ సాంప్రదాయ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చిలకలగుట్టలో ఉన్న సమ్మక్క ప్రతిరూపం కుంకుమ భరణి ప్రత్యేక పూజల అనంతరం మేడారం గద్దెల ప్రాంతానికి తీసుకొచ్చి ప్రతిష్టించారు. శుక్రవారం గద్దెలపై నలుగురు వనదేవతలు ప్రతిష్టించి ఉండడంతో భక్తులు సెంటిమెంట్ రూపంలో శుక్రవారం అత్యధికంగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం సైతం భక్తుల రద్దీ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి భక్తులు తిరుగు ప్రయాణం తో రహదారిపై గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వచ్చి పోయే భక్తుల వాహనాలకు తీవ్ర ఆటంకాలు కలిగాయి. జాతర ఆధ్యాంతం సక్సెస్ఫుల్ గా ప్రభుత్వ అధికారులు లాంఛనంగా నిర్వహించినప్పటికీ చిన్నచిన్న ఆటంకాలు భక్తులకు ఇబ్బందులను కలిగించాయి. ట్రాన్స్ఫార్మర్ల లోపంతో కొద్ది సమయం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భక్తులు అసహనానికి గురయ్యారు. దాంతోపాటు రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో కూడా భక్తులు తిప్పలు పడ్డారు.

Advertisement

Alson Read: Hyundai Creta Electric: హ్యుండాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు.. దీనికి బ్రేకులు ఉండవు తెలుసా?

వైద్య సేవలు బేష్..

సుదూర ప్రాంతాల నుంచి కోట్ల కొలది భక్తులు జాతరకు రావడంతో అదే స్థాయిలో ప్రభుత్వం వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Super Specialty Hospital)ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రాథమిక ఆసుపత్రులు, సబ్ సెంటర్లు అనేకం ఏర్పాటుచేసి అడుగడుగున భక్తులకు వైద్యం అందించి ప్రభుత్వం దృష్టిలో వైద్యులు బేష్ అనిపించుకున్నారు. అత్యవసర అంబులెన్స్ల ద్వారా ఐదుగురు గర్భిణీలకు ప్రసవాలు చేసి వైద్యులు శభాష్ అనిపించుకున్నారు. క్యూలైన్లలో నిలబడి అనారోగ్యానికి గురైన వారందరిని ద్విచక్ర వాహనాలపై ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర సేవలు అందించారు. అంతేకాకుండా పారిశుద్ధ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడా కూడా వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా జాతర శివారు ప్రాంతాలకు తరలించారు.

అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖులు

Advertisement

2026 మేడారం మహా జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యాధునిక సౌకర్యాలతో భక్తులకు అన్ని రకాల వసతులను కల్పించింది. తొలుత జనవరి 19వ తేదీన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.. దంపతులు తొలిసారి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన సాంప్రదాయాల ప్రకారం నిలువెత్తు బంగారంతో పాటు సారే, చీర పసుపు కుంకుమ సమర్పించారు. జాతర మొదలైన తర్వాత రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ(Governor Jishnu Dev Sharma), కేంద్ర మంత్రులు జు ఓరం, కిషన్ రెడ్డి(Kishan Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adlure Laxman), రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srnivas Reddy), మంత్రి సీతక్క(Minister Seethaka), దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Sureka), జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) తోపాటు ప్రముఖులు సమ్మక్క సారలమలం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులతో మేడారం మహా జాతరను అత్యంత అద్భుతంగా నిర్మించింది. అంతేకాకుండా భక్తులకు శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు మరో 100 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు భూ సేకరణ సైతం చేస్తోంది.

Also Read: Venkatesh Remuneration: వరుస హిట్లు.. రెమ్యూనరేషన్ డబుల్ చేసిన వెంకీ మామ.. ఎంతంటే?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×