E-Paper
Advertisement

వంట చేస్తుండగా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. స్పాట్‌లో యువకుడు..?

వంట చేస్తుండగా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. స్పాట్‌లో యువకుడు..?
Advertisement

Medchal Explosion: గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో అప్రమత్తమైన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో హుటా హుడిన అక్కడికి చురకున్న సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు.

వంట చేస్తున్న క్రమంలో

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ధర్మేంద్ర (23) కండ్లకోయలోని మయూర్‌ ఇండియా చాక్లెట్‌ కంపెనీలో పనిచేస్తూ మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు. వంట చేస్తున్న క్రమంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో అతడి శరీరం తీవ్రంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న మేడ్చల్‌ 108 అంబులెన్స్‌ సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్‌ కరుణాకర్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఆర్‌సీపీ వైద్యుడు డాక్టర్‌ చక్రవర్తి సూచనల మేరకు బాధితుడికి ప్రథమ చికిత్స అందించి ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమం..

Advertisement

ప్రస్తుతం ధర్మేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సకాలంలో స్పందించి బాధితుడిని ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది సీతారాం, కరుణాకర్‌లకు స్థానికులు, బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్యాస్ తో పని చేసే సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

Also read: మీ మొబైల్లో వాట్సాప్‌కి YES or NO అని మెసేజ్ వస్తుందా.. అయితే బీ కేర్ ఫుల్..?

Tags

Related News

దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!

మీ మొబైల్లో వాట్సాప్‌కి YES or NO అని మెసేజ్ వస్తుందా.. అయితే బీ కేర్ ఫుల్..?

ఉప్పల్‌లో ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు.. పోలీసుల గైడ్‌లైన్స్ ఇవే!

రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రులు గోవా, ఢిల్లీ ట్రిప్పులా?: హరీశ్‌రావు

కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు.. రేవంత్ రెడ్డికి రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్!

దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇల్లు అమ్ముతానని రూ.31.77 లక్షలు వసూలు.. మరో బ్యాంకులో తనఖా!

Big Stories

Advertisement
×