E-Paper
Advertisement

మీ మొబైల్లో వాట్సాప్‌కి YES or NO అని మెసేజ్ వస్తుందా.. అయితే బీ కేర్ ఫుల్..?

మీ మొబైల్లో వాట్సాప్‌కి YES or NO అని మెసేజ్ వస్తుందా.. అయితే బీ కేర్ ఫుల్..?
Advertisement

WhatsApp Scam: వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం ‘NO’ అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయిందని, బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు.. ఏ అనుమానాస్పద లింక్‌పైనా క్లిక్ చేయలేదు.. కేవలం ‘NO’ అనే రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసిందని వీసీ సజ్జనార్ తెలిపారు. ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం నా దృష్టికి వచ్చిందని, సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది అని వీసీ సజ్జనార్ తెలిపారు.

Yes or No అంటూ..

ఈ మోసం ఎలా జరుగుతోందంటే మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అంటూ నకిలీ సందేశం వస్తుంది. ఆ వెంటనే మిమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ.. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పంపుతారని తెలిపారు. ఖాతాలో డబ్బులు పోయాయన్న కంగారుతో మీరు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే.. ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్‌వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయని, క్షణాల్లో మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను హ్యాకర్లు చేజిక్కించుకుని, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ ఊడ్చేస్తారని తెలిపారు.

Advertisement

Also read: మార్కెట్‌ను షేక్ చేస్తున్న100 ఇంచుల టీవీ..ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లు

మీ అధికారిక బ్యాంక్..

అందుకే ప్రజలందరికీ విజ్ఞ‌ప్తి అని సీపీ సజ్జనార్ తెలిపారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు ‘YES’ గానీ, ‘NO’ గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వకండని అన్నారు. కంగారుపడి ఎలాంటి సమాధానమూ పంపకుండా వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయాలని మీ ఖాతాలో డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీ అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోండి తప్ప, వాట్సాప్ సందేశాలను అస్సలు నమ్మకండని సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు.

గోల్డెన్ అవర్‌లో..

Advertisement

ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గోల్డెన్ అవర్‌లో వెంటనే ‘1930’ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండని సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. కంగారులో ఇచ్చే ఒక్క నో అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త అంటూ సీపీ సజ్జనార్ తెలిపారు.

Also read: ఉప్పల్‌లో ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు.. పోలీసుల గైడ్‌లైన్స్ ఇవే!

Tags

Related News

దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!

వంట చేస్తుండగా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. స్పాట్‌లో యువకుడు..?

ఉప్పల్‌లో ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు.. పోలీసుల గైడ్‌లైన్స్ ఇవే!

రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రులు గోవా, ఢిల్లీ ట్రిప్పులా?: హరీశ్‌రావు

కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు.. రేవంత్ రెడ్డికి రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్!

దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇల్లు అమ్ముతానని రూ.31.77 లక్షలు వసూలు.. మరో బ్యాంకులో తనఖా!

Big Stories

Advertisement
×