BigTV English

Mermaids hungama in Hyderabad: జల కన్యల హంగామా, వాళ్లని చూసేందుకు..

Mermaids hungama in Hyderabad: జల కన్యల హంగామా, వాళ్లని చూసేందుకు..

Mermaids hungama in Hyderabad(Latest news in Hyd): జల కన్యల గురించి రకరకాల కథలు పెద్దవాళ్లు చెబుతారు. వారు చెప్పినప్పుడు చూడాలనే కోరిక బలంగా ఉంటుంది. సినిమాలు, గ్రాఫిక్స్ మాయాజాలం తప్పితే వారిని నేరుగా చూసిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. సముద్రం ఒడ్డున వారి విగ్రహాలు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. లేదంటే ఆ తరహా సినిమా అప్పుడప్పుడు వస్తాయి.


తాజాగా హైదరాబాద్‌లో జలకన్యలు ఓ రేంజ్‌‌లో హంగామా చేశాయి. మరి హైదరాబాద్‌లో సముద్రం లేదు కదా, జల కన్యలు ఎలా వచ్చారనే సందేహం వచ్చే ఉంటుందని కదా! అక్కడికే వచ్చేద్దాం.

హైదరాబాద్‌‌లోని కూకట్‌పల్లిలో జల కన్యలు ఓ రేంజ్‌లో దర్శనమిచ్చారు. మెరైన్ పార్కులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో సందడి చేశారు. వారితో ప్రత్యేకంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయం తెలియగానే హైదరాబాద్ నలుమూలల నుంచి చిన్నారులను తీసుకుని పేరెంట్స్ తరలివచ్చారు.


Mermaids hungama at kukatpally exhibition in hyderabad
Mermaids hungama at kukatpally exhibition in hyderabad

వారిని చూసేందుకు సందర్శకులు బారులు తీరారు. నిజమైన జలకన్యలు ఎలా వుంటారో అచ్చం అలాగే ఉన్నారు. వారిలో చాలామంది సెల్ఫీలు తీసుకున్నారు. దేశంలోని ఎక్కడ లేని విధంగా తొలిసారి హైదరాబాద్ ఈ తరహా ప్రదర్శన చేశారు. మరి వాళ్లని మనం కూడా ఓసారి చూసేద్దాం.

Mermaids hungama at kukatpally exhibition in hyderabad
Mermaids hungama at kukatpally exhibition in hyderabad

సాగర కన్యల గురించి తెలుగులో చాన్నాళ్ల కిందట ఓ సినిమా వచ్చింది. వెంకటేష్-శిల్పాశెట్టి జంటగా వచ్చింది సాహసవీరుడు సాగరకన్య మూవీ. అప్పట్లో సాగర కన్యను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిన సందర్భాలు వున్నాయి.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×