E-Paper
Advertisement

Ponguleti Srinivasa Reddy: అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ!

Ponguleti Srinivasa Reddy: అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ!
Advertisement

Ponguleti Srinivasa Reddy: ఇల్లందు స్వేచ్ఛ : గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూములు పూర్తికాని వాటన్నింటిని రాజీవ్ గృహకల్ప లో పునర్నిర్మాణం చేపట్టి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది. ఇల్లెందు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన రోడ్ షో లో శాసనసభ్యులు కోరం కనకయ్య, డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న, స్థానిక నాయకులు వార్డుల అభ్యర్ధులతో కలిసి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగిలేటి పాల్గొన్నారు.

Also ReadPonguleti Srinivasa Reddy: కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివారు.. అందుకే అసెంబ్లీకి రావాలి.. మంత్రి పొంగులేటి

ప్రతిపక్షానికి డిపాజిట్లు దక్కుతాయా? 

Advertisement

ఇల్లెందు పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న జన సంద్రాన్ని చూస్తుంటే ప్రతిపక్షానికి డిపాజిట్లు దక్కుతాయా అనే అనుమానం కలిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవిన్యూ శాఖ మంత్రిగా ప్రభుత్వ భూములు ఎక్కడైతే నివాసయోగ్యానికి అనుకూలంగా ఉన్నాయో తప్పకుండా అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాదేనని, ప్రధాన సమస్య సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వాటిని చాలా వరకు రెగ్యులరైజ్ చేశామన్నారు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. త్వరలో 76 జీవో ప్రకారం సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతాం 

పట్టణంలో అక్రమానికి గురై కబ్జా చేసిన ప్రభుత్వ 20 ఎకరాల భూమిని తిరిగి దాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామని, గోవింద సెంటర్ ప్రభుత్వ పాఠశాల దగ్గర ముస్లిం మైనార్టీలకు షాదీఖాన భవనం కోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశామని వివరించారు. కూసుపల్లి ఓపెన్ కాస్ట్ ని సింగరేణి ద్వారా దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన 24 వార్డుల అభ్యర్ధులను గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి కోసం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఇల్లెందు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీదే : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×