EPAPER

Ponnam Comments on Kishan Reddy: హైదరాబాద్ గురించి కిషన్‌రెడ్డి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది: మంత్రి పొన్నం

Ponnam Comments on Kishan Reddy: హైదరాబాద్ గురించి కిషన్‌రెడ్డి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది: మంత్రి పొన్నం

Minister Ponnam Comments on Kishan Reddy(TS Politics): హైదరాబాద్ గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కిషన్ రెడ్డి మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ చారిత్రాత్మక నగరం. హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర టూరిజం మంత్రిగా గత 5 సంవత్సరాల్లో కేంద్రం నుండి హెరిటేజ్, టూరిజం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల నుండి హైదరాబాద్‌కు ఏం తెచ్చావు.. ఒక్క రూపాయి అయినా తెచ్చావా..?


కేంద్రం నుండి హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు..అమృత్ పథకం నుండి ఒక్క రూపాయి తేలేదు. 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి బీజేపీ చేసింది ఏమైనా ఉందా? ఉంటే కిషన్ రెడ్డి చెప్పాలి. రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటకాగి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా..? స్థానిక సంస్థలను 73, 74 రాజ్యాంగం ద్వారా వచ్చే 15 వ ఫైనాన్స్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి అయినా తెచ్చారా..? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుండి నిధులు కావాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. మా మంత్రి వర్గంతో కూర్చుండి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేకసార్లు ప్రణాళిక వేసుకుందాం రండి. మీరు కేంద్ర మంత్రి అయిన తరువాత హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా గౌరవంగా మిమ్మల్ని కలవడానికి వచ్చినా హైదారాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరాం..

Also Read: బండి సంజయ్‌కు కేటీఆర్ లేఖ.. సిరిసిల్ల కోసం రిక్వెస్ట్


జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని రాజకీయ ఆట కోసం ఇలా మాట్లాడొద్దు. కేంద్రమంత్రిగా హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు.. నగర్ అభివృద్ధి కొరకు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నా. హైదరాబాద్ అంత నిర్లక్ష్యం చేసినట్టు అభివృద్ధి కుంటుపడినట్టు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ హిస్టారికల్ సిటీ. ఇస్తాంబుల్ నగరం లాంటిది.. చార్మినార్, గోల్కొండ లాంటి ఆర్కియాలజీకి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. ఒక్క రూపాయి అయినా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారా?.

హైదరాబాద్ లో ఉన్న 151 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే ప్రభుత్వ స్థలాల్లో అండర్ గ్రౌండ్ లోకి వాటర్ వెళ్ళే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. హైదరాబాద్ లో శానిటేషన్ లాంటి కార్యక్రమాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఇమేజ్ భంగం కలిగేవిధంగా మాట్లాడిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.

హైదరాబాద్ అభివృద్ధికి చేతనైతే సహాయం చేయండి. రాజకీయాలకు అతీతంగా ఇంచార్జి మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్ప మీరు ఏం చేశారు?
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి హాస్పిటల్స్ మరింత సేవ చేసే విధంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురండి. హైదరాబాద్ కు ప్రత్యేక నిధులు తీసుకురండి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది.. కేంద్రం 10 సంవత్సరాలుగా తెలంగాణకు.. అందులో హైదారాబాద్ కు ఏం తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి.

ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తెచ్చారా..? హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైంది అనడానికి మీకు హక్కు ఉందా..? స్మార్ట్ సిటీలోలేదు, అమృత్ పథకంలో లేదు. చట్టరీత్యా 15 వ ఫైనాన్స్ తప్ప ఒక్క రూపాయి అయినా తెచ్చారా..? మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో జీహెచ్ఎంసీ,హైదారాబాద్ కలెక్టరేట్ లో అనేక సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నాం’ అని మంత్రి అన్నారు.

‘కేటీఆర్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. బీజేపీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తేలేకపోయావు.. ఇప్పుడు హైదారాబాద్ గురించి మాట్లాడుతున్నావ్. భూకబ్జాలు, అక్రమ కట్టడాలతో హైదరాబాద్ ఇలా కావడానికి కారణం మీరే. కిషన్ రెడ్డి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా ఇలా మాట్లాడుతున్నారు.

ఆరు నెలల్లో రాజధాని హెడ్ క్వార్టర్స్ లో ఇంచార్జి ఇచ్చిన తరువాత అనేక కార్యక్రమాలు చేపడతాం. బోనాల పండుగ తరువాత నేరుగా హైదరాబాద్ బస్తీల్లోకి వెళ్తాం. నేరుగా సమస్యలు పరిష్కరిస్తాం. హైదరాబాద్ లో ఉన్న 150 డివిజన్ లలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం.

Also Read: చిన్న రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

హైదరాబాద్ కు బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి. ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైందని అడిగింది విల్లే. వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారు? ప్రక్రియ ప్రారంభమైన తరువాత అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది వీళ్లే.

విద్యార్థులను నేను కోరుతున్నా.. ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి. నిజమైన సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. 10 సంవత్సరాల్లో డీఎస్సీ పోస్టులు వేయనోళ్లు, టెట్ నిర్వహించనోళ్లు ఎందుకు రెచ్చగొడుతున్నారు. మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించడం ఇష్టంలేదా అని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలు నోరు మూసుకున్నారు. ఇప్పుడు కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యడం బీఆర్ఎస్ కు ఇష్టంలేదు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఉద్యోగాలు ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ మంత్రి మండిపడ్డారు.

Related News

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వం సహకరించకున్నా సరే, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తాం : కిషన్‌రెడ్డి

Telangana High Court Stay Order: బడాబాబుల సొసైటీకి భారీ షాక్..కొత్త సభ్యత్వాలపై హైకోర్టు స్టే..గుట్టంతా ముందే బయటపెట్టిన ‘స్వేచ్ఛ’

Ghmc : టపాసులు అమ్ముతున్నారా, అయితే మీ దుకాణాలకు ఇవి తప్పనిసరి, లేకుంటే అంతే సంగతులు : జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

CM Revanth Reddy: రేపే గుడ్ న్యూస్.. మీ వాడినై మీ సమస్యలు పరిష్కరిస్తా.. ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్

Congress MLA On Tirumala: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు అనుమతించక పోతే.. తిప్పలు తప్పవు.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

Bhatti Vikramarka : సింగరేణి కార్మికులకు శుభవార్త, దీపావళి బోనస్’గా రూ.358 కోట్లు రిలీజ్, రేపే అకౌంట్లలో వేస్తాం : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Kaleshwaram Commission: కథ.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్.. అంతా కేసీఆర్‌దే!

Big Stories

×