E-Paper
Advertisement

Karimnagar Mayor Election: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న.. మెజారిటీ లేకున్నా మేయర్ ఎలా అవుతారు?

Karimnagar Mayor Election: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న.. మెజారిటీ లేకున్నా మేయర్ ఎలా అవుతారు?
Advertisement

Karimnagar Mayor Election: కరీంనగర్ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రస్తావిస్తూ, అక్కడ తమకు సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో మేయర్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఎంపీ అరవింద్ స్వయంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అయితే, కరీంనగర్ విషయంలో మాత్రం బీజేపీ విభిన్నంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కరీంనగర్‌లో స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పటికీ, తామే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని బండి సంజయ్ చెప్పడం ఏ ప్రాతిపదికన అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 69 స్థానాలకు గాను బీజేపీకి కేవలం 30 స్థానాలు మాత్రమే లభించాయని మంత్రి స్పష్టం చేశారు. మెజారిటీకి కావాల్సిన సంఖ్య లేనప్పుడు అధికారం కోసం పాకులాడటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. మిగిలిన కార్పొరేటర్లందరూ ప్రజాస్వామ్యబద్ధంగానే మేయర్ను ఎన్నుకుంటారని, ఈ విషయంలో తమ ప్రభుత్వం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. బీజేపీయేతర కార్పొరేటర్లను ఏకం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అందరినీ కలుపుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

Advertisement

బీజేపీ గతంలో అనుసరించిన అనైతిక రాజకీయ వ్యూహాలనే ఇప్పుడు తాము కూడా ప్రయోగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, స్థానిక అభివృద్ధి కోసం అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గెలిచిన ప్రతి కార్పొరేటర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, వారి అభీష్టం మేరకే ముందుకు సాగుతామని చెప్పారు. అధికారం కోసం అక్రమ మార్గాలు పట్టకుండా, కేవలం రాజకీయ వ్యూహాలతోనే బీజేపీని ఎదుర్కొంటామని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల తుది ఘట్టంపై స్పందిస్తూ, ఈ నెల 16వ తేదీన ఏం జరుగుతుందో అందరూ తెరపై చూడొచ్చని మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేయర్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, ఈ తరుణంలో క్యాంపు రాజకీయాలు ఉండటం సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి మేయర్ సీటు దక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Read Also: Junior Doctors: తెలంగాణ జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల..!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×