Laila Movie Controversy : ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పా… ఒప్పా అనేది పక్కన పెడితే.. లైలాకి మాత్రం బాగానే కలిసొచ్చింది అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అదే అండి… 30 ఇయర్స్ పృథ్వీ గురించి. ఆయన యాదృచ్ఛికంగా అన్నాడా..? లేదా కావాలనే అన్నాడా అనే విషయాన్ని పక్కన పెడితే… అనుకున్నదాని కంటే ఎక్కువ రచ్చే జరిగింది. ఫలితం… లైలా మూవీకి ప్లస్ అయింది అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఆ… కథేంటో ఇప్పుడు చూద్ధాం…
‘11’ గొర్రెలు… ఇది లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 30 ఇయర్స్ పృథ్వి చెప్పిన డైలాగ్. ఈ సినిమాలో ఓ సీన్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ ‘11’ అనేది సోషల్ మీడియాలో, బయట విరి విరిగా వాడుతున్న పదం. అయితే ఓ మూవీ ఈవెంట్ స్టేజ్‌పై అందులోనూ… మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తున్న ఈవెంట్ స్టేజ్‌పై… ఇంకా చెప్పాలంటే… టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎంతో సన్నిహితంగా ఉండే హీరో యొక్క మూవీ ఈవెంట్ స్టేజ్‌పై ఈ డైలాగ్ రావడంతో ఓ వర్గం జనాలను బాగా హర్ట్ చేసింది.
దీంతో… బాయ్ కాట్ లైలా అనేది ట్రెండ్ అయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు… డ్యామేజ్ మొత్తం జరిగిన తర్వాత హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి ఓ ప్రెస్ మీట్ పెట్టి కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయినా… ఆ బాయ్ కాట్ ట్రెండ్ ఆగలేదు.
అది కంటిన్యూ అవుతున్న టైంలోనే… వియ్ సపొర్ట్ టూ లైలా అంటూ మరో ట్రెండ్ స్టార్ట్ అయింది. దీనికి టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి, మెగా అభిమానులు కూడా సపొర్ట్ చేశారు. దీంతో రేపు రిలీజ్ కాబోతున్న లైలా సినిమాపై పబ్లిసిటీ పీక్స్‌లో జరిగిపోయింది.
దీంతో టీడీపీ vs వైసీపీ సోషల్ మీడియా వార్ లైలా సినిమాకు బాగానే హెల్ప్ అయింది అనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే… ఈ మూవీకి ఈ కాంట్రవర్సీ లేని టైంలో… ఎలాంటి బజ్ లేదు. విశ్వక్ సేన్ కెరీర్‌లో ఫస్ట్ టైం లేడీ గెటప్ వేసినా.. ఈ మూవీపై ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతే కాదు… ఈవెంట్‌లో… మెగాస్టార్ చిరంజీవి స్పీచ్‌ను కూడా పృథ్వీ స్పీచ్ డామినేట్ చేసిందనే టాక్ కూడా వచ్చింది.
ఇదంతా… చూసిన తర్వాత, ‘11’ తో లైలా సినిమాకు నష్టం జరుగుతుంది అని భావించిన వాళ్లు ఇప్పుడు… డామిట్ కథ అడ్డం తిరిగిందే అని నాలుక కరుచుకుంటున్నారు అంటూ జోక్స్ పేలుతున్నాయి ఇండస్ట్రీలో…
విశ్వక్‌కు ఎప్పుడూ జరిగేదే ఇది…
ఏది ఏమైనా… విశ్వక్ మూవీ వస్తుంది అంటే చిన్న హాడావుడి అనేది వెరీ కామన్. ఈయన ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ జరగడం అనేది సంప్రదాయబద్దంగా వస్తుంది. ఇప్పుడు లైలా మూవీకి కూడా అదే కొనసాగుతుంది. అయితేే ఈ సారి ఆయన ప్రమేయం లేకుండానే ఈ కాంట్రవర్సీ జరుగుతుంది.