Minister Tummala Nageswara Rao on Seed Supply: విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. విత్తన సరఫరాలో ఇబ్బంది సృష్టించిన ఏ కంపెనీని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. రైతు ప్రయోజనాలకు భంగం కల్గించే చర్యలను ప్రభుత్వం సహించదని తెలిపారు.
విధుల్లో అలసత్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి విత్తనాల అమ్మకాలను పర్యవేక్షించడంతో పాటు నకిలీ విత్తనాల అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఖరీఫ్ లో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తిసాగు అవుతుందని అంచనా వేసారు. అయితే అందుకు సరిఫడా బీజీ-2 పత్తి విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ప్రపంచ మార్కెట్ లో ప్రత్తి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ ఏడు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బీజీ-2 విత్తన ప్యాకెట్ లకు గరిష్ట ధర రూ. 864 కాగా కేంద్రం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా మే చివరి నాటికి రైతులకు బీజీ- 2 విత్తనాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: బీజేపీ దిగజారింది, పదేళ్లు ఏం చేశారంటూ..
ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ఏన్కూర్ లింక్ కెనాల్ పనులు శర వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఏన్కూరు దగ్గర సీతారామ లింక్ కెనాల్ పనులను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసి.. సీఎం చేతుల మీదుగా కాల్వను ప్రారంభిస్తామని చెప్పారు.