BigTV English

Uttam Kumar Reddy: వరదలపై బురద రాజకీయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

Uttam Kumar Reddy: వరదలపై బురద రాజకీయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

వరదలపై బురద రాజకీయం
– వేగంగా మరమ్మతుల పనులు
– ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం
– త్వరలోనే పూర్తి చేసి సాగునీరిస్తాం
– వరదలతో రూ. 10,300 కోట్ల నష్టం
– బీఆర్ఎస్ నేతలూ.. ఇదేం రాజకీయం
– హుజూర్ నగర్, కోదాడ సెగ్మంట్ల పనుల పర్యవేక్షణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


Flood Politics: రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలతో వరదలు వచ్చాయని, కానీ, ఈ ఆపత్కాలంలోనూ వరదలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో వరద వల్ల సంభవించిన నష్టంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చిందని తెలిపారు. రూ. 10,300 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు వివరించారు. వరద నష్టంపై ఇది వరకే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ రిపోర్టుపై సమాధానం రావాల్సి ఉన్నదని తెలియజేశారు. జిల్లాలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయింది. ఈ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

స్పీడప్ చేయాలె..
స్పీడప్ చేయాలే.. మళ్లీ పంట వేసే కాలం సమీపించిందని, ఇప్పుడు సాగు నీటి అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే సాగర్ ఎడమ కాలువ రిపేర్లను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఎస్‌పీ కాలువ, రెడ్లకుంట మేజర్‌కు గండి పడగా.. దీని మరమ్మతు పనులను ఏ స్థాయికి వచ్చాయో పరిశీలించారు. ఆ తర్వాత ముక్త్యాల మేజర్ కాలువ గండి, మఠంపల్లి మండలంలో తెగిపోయిన చౌటపల్లి చెరువు కట్టలకు సంబంధించిన మరమ్మతు పనులనూ మంత్రి ఉత్తమ్ పరిశీలన చేశారు. సాగర్ ఎడమ కాలువ పునర్నిర్మాణానికి రూ. 2.10 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు.


ఇబ్బందేమీ లేదు..
బీఆర్ఎస్ ప్రకటించిన ప్రాజెక్టుల పాదయాత్ర కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ.. ఆ పాదయాత్రతో తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వారి ప్రభుత్వం కంటే తమ కాంగ్రెస్ సర్కారు గొప్పగా చేస్తోందని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ముందుగా చెప్పినట్లుగా.. అనుకున్న సమయంలోనే పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, కాంగ్రెస్‌కు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు ఆదర్శపాలన అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో ఓ చోట సాగర్​కాల్వకు గండి పడటంలో మరో రెండు చోట్ల గండి పడే పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటి రిపేర్లకు రూ.9.43 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరిన హరీశ్‌రావు.. ఈసారి రాజీనామా గురించి కాదు.. ఇంకోటి

ఎడమ కాలువ పరిధిలో
సూర్యాపేట జిల్లాలోనీ కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగితం రామాచంద్రాపురం వద్ద 132 కి. మీ వద్ద పడిన గండి పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయని, హుజూర్ నగర్ సెగ్మెంట్ పరిధిలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ రిపేర్లకు రూ. 34 లక్షలు, హుజూర్ నగర్ మండలం బూరుగ్గడ్డ నల్లచెరువు గండి పూడ్చివేతకు 2.26 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. అదే విధంగా, మఠంపల్లి మండలం మామిళ్లచెరువుకు 3.55 కోట్లు మంజూరు, అదే మండలంలోని చౌటపల్లి చెరువుకు రూ. 2.94 కోట్లు, చిలుకూరు మండలం నారాయణపురం చెరువుకు 2.52 కోట్లు, మేళ్లచెరువు మండలం నాగులచెరువుకు రూ. 85.15 లక్షలు, కోదాడ మండలం ఆర్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్లకుంట మేజర్‌కు 96.60 లక్షలు మంజూరు చేశామని మంత్రి లెక్క చెప్పారు. వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 773 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని, ఇప్పటికే 181 చోట్ల మరమ్మతులు పూర్తి చేశామని, మరో 35 చోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.

Related News

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వేధించిన ఆకతాయిలు.. అక్కడ తాకేందుకు ప్రయత్నం..

Medak Flood: మెదక్ రామాయంపేటలో వరద ఆందోళన.. హాస్టల్‌లో చిక్కుకున్న 400 విద్యార్థులు

Kamareddy floods: కామారెడ్డిలో వర్షాల బీభత్సం.. 60 మందిని రక్షించిన రియల్ హీరోస్!

Big Stories

×