EPAPER

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Grand Success Meet of Kalinga Telugu Movie: ఇటు డైరెక్టర్ గా.. అటు హీరోగానూ ధృవ వాయు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే కిరోసిన్ సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు చూపించిన ధృవ.. కళింగ సినిమాతోనూ ఇప్పుడు మరోమారు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. బిగ్ బిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ సినిమాను నిర్మించగా, సెప్టెంబర్ 13న థియేటర్లో రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.


ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ ధృవ వాయు మాట్లాడుతూ..’ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాలాంటి ఓ కొత్త వ్యక్తి వచ్చి సినిమా తీయడం అనేది చాలా కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో సినిమాను తీసి.. హిట్ కొట్టాను. ఇలా హిట్ కొట్టడమంటే మామూలు విషయం కాదు. మీడియా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది. లేకపోతే మా సినిమా ఇంత పెద్ద స్థాయిలో హిట్ అయ్యేదికాదు. ఇటు వర్డ్ ఆఫ్ మౌత్ తో నూ ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కువగా చేరవవుతోంది. మేం తీసిన ఈ సినిమా ఇంతగా ఇష్టపడుతూ హిట్ చేస్తున్నందుకు మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని ప్రతి విజువల్ సూపర్ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏ సినిమాలో అయినా కంటెంట్ ఉంటే సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి చూపించారు. ఈ సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రతిఒక్కరికీ పెద్ద థ్యాంక్స్’ అంటూ ధృవ వాయు ఎమోషనల్ అయ్యారు.

అనంతరం నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడారు. ‘మొదటి నుంచి కూడా ఈ సినిమా పట్ల డైరెక్టర్ ధృవ వాయు మంచి నమ్మకంతో ఉన్నాడు. ఆయన నమ్మకమే ఈ సినిమాను ఇక్కడివరకు తీసుకువచ్చింది. ధృవ వల్లే ఈ సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ సాధ్యమైంది. సినిమాను ఏ యాంగిల్ లో చూసినా చాలా బాగుందంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్’ అని పేర్కొన్నారు.


ఆ తరువాత మరో నిర్మాత పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ..’ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మొదటి నుంచి మేం అనుకున్నాం. అనుకున్న విధంగా ఈ సినిమా హిట్ అయ్యింది. ఇటు ప్రేక్షకులకు, అటు మీడియాకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అంటూ పృథ్వీ పేర్కొన్నారు.

Also Read: ప్రియుడితో ఏడడుగులు వేసిన నితిన్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

హీరోయిన్ ప్రగ్యా నయన్ కూడా మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘కళింగ సినిమాలో నేను పోషించిన రోల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో పద్దు అనే క్యారెక్టర్ నాది. సినిమా ఫుల్ హిట్ అవడంతో ఇప్పుడు నన్ను అంతా పద్దు అనే పిలుస్తున్నారు. అలా అంతా పద్దు అని పిలుస్తుంటే నాకు తెగ హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమా కోసం గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను. కానీ, ఈ సినిమా హిట్ అయినంక ఆ మూడేళ్ల కష్టం చిటికెలో మరిచిపోయాను’ అంటూ ఆమె పేర్కొన్నారు.

అనంతరం చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా కోసం డైరెక్టర్ ధృవ వాయు చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాను పూర్తిగా అడవుల్లో షూటింగ్ చేశాం. అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేటివి కావు. అంతలా ఈ సినిమా కోసం మేమంతా కష్టపడ్డాం. ఇప్పుడు సినిమా సక్సెస్ ను చూస్తుంటే మేం అదంతా మరిచిపోయాం. కళింగ మూవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నా’ అంటూ ఆయన పేర్కొన్నారు.

చివరగా కెమెరామెన్ మాట్లాడుతూ.. ‘కళింగ మూవీ రిలీజ్ అయినంక ఏ వార్త చూసినా మా గురించి చాలా గొప్పగా రాశారు. ఎక్కువగా ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో పనిచేసే అవకాశం కల్పించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నా’ అంటూ అక్షయ్ అన్నాడు.

Related News

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

KCR: గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్.. కేసీఆర్ నిజంగానే కనబడుటలేదా?

KTR on Hydra: హైడ్రాకు కేటీఆర్ కౌంటర్.. ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్సయ్యారో..

Big Stories

×