E-Paper
Advertisement

Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం

Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం
Advertisement

Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ రాని ‘హంగ్’ మున్సిపాలిటీల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అక్కడ స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు కీలకంగా మారారు. ఈక్రమంలో.. కనీసం 8 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఆ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కమలం జెండా ఎగురవేయడానికి పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముందస్తుగా స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. గెలిచిన ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా మేజిక్ ఫిగర్‌ను అందుకోవాలని చూస్తోంది. ఒకవేళ స్వతంత్రులతో బలం సరిపోని పక్షంలో.. బీఆర్ఎస్, అవసరమైతే కాంగ్రెస్ కు చెందిన అసంతృప్త కౌన్సిలర్లను చేర్చుకోవడంపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

స్వల్ప తేడాతో అధికారం

కాషాయ పార్టీ వ్యూహరచనలో భాగంగా, పార్టీ కీలక నేతలకు ఆయా మున్సిపాలిటీల బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే బీజేపీ బృందాలు క్షేత్రస్థాయికి చేరుకుని సంప్రదింపులు ప్రారంభించాయి. కౌన్సిలర్లు చేజారిపోకుండా ఉండేందుకు క్యాంప్ రాజకీయాలకు కూడా తెరలేపినట్లు తెలుస్తోంది. పార్టీ కీలక నేతలు ఇప్పటికే కొందరు కౌన్సిలర్లను రహస్య ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా బీజేపీ బలంగా ఉన్న, స్వల్ప తేడాతో అధికారం దూరమైన 8 మున్సిపాలిటీలపై పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇక్కడ చైర్మన్ పదవిని దక్కించుకోవడం ద్వారా రాష్ట్రంలో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని బీజేపీ భావిస్తోంది. ఇతర పార్టీల నేతలు కూడా ఇదే తరహాలో పావులు కదుపుతుండటంతో, హంగ్ మున్సిపాలిటీల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

బీజేపీలో చేర్చుకోవచ్చా? లేదా?

Advertisement

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎక్కడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అసంతృప్తులను లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేసింది. అలా దాదాపు 8 స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భైంసా, రాయికల్, అమరచింత, మెట్ పల్లి, కాగజ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, ఆదిలాబాద్ చైర్మన్ పీఠాలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత స్వంత్రంత్ర అభ్యర్థులతో మంతనాలు చేపడుతోంది. అది వర్కవుట్ అవ్వకుంటే బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లను బీజేపీలో చేర్చుకోవచ్చా? లేదా? అనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటే కాంగ్రెస్ కు అస్త్రాన్ని అందించినట్లవుతుందని కాషాయ పార్టీ భావిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చినట్లవుతుందనే అంశంపై కమలనాథులు తర్జనభర్జన పడుతున్నారు.

Also Read; JanaSena Membership 2026: జనసేన సభ్యత్వ నమోదు షురూ.. రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్!

తీవ్రంగా సంప్రదింపులు..

Advertisement

ఆదిలాబాద్ లో మొత్తం 49 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ కు 25 అవసరం. బీజేపీకి 21 స్థానాలు ద్కాయి. ఐదుగురు ఇండిపెండెంట్లు అక్కడ ఉన్నారు. వారితో కలిసి బీజేపీ మున్సిపల్ చైర్మన్ కోసం ప్రయత్నం చేపడుతోంది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం బీజేపీ, కాంగ్రెస్ నడుమ పోటాపోటీగా ప్రయత్నాలు సాగుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులతో రెండు పార్టీలు తీవ్రంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. విద్యానగర్ కౌన్సిలర్ కల్లాల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి బీజేపీ నాయకుడు పాయల్ శరత్ మంతనాలు సాగించినట్లు సమాచారం. బీజేపీకి మద్దతిస్తే వైస్ చైర్మన్ పదవి హమీ ఇచ్చినట్లు వినికిడి. కాగా వార్డు ప్రజలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని శ్రీనివాస్ చెప్పినట్లు టాక్. ఇకపోతే.. కాగజ్ నగర్ లో మొత్తం 30 స్థానాలకు బీజేపీ 5 గెలిచింది. బీఆర్ఎస్ 11 స్థానాలు దక్కించుకుంది.

చైర్మన్ కోసం కాషాయ పార్టీ..

మ్యాజిక్ ఫిగర్ 16 కావడంతో ఇక్కడ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కు ఇచ్చి.. వైస్ చైర్మన్ కోసం కమలం పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భైంసాలో మొత్తం 26 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 14గా ఉంది. బీజేపీ 6 స్థానాల్లో గెలవడగా ఏడు స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఎక్స్ అఫీషియో తో చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అలాగే మెట్ పల్లిలో మొత్తం 26 స్థానాలు కాగా బీజేపీ 10 స్థానాలు దక్కించుకుంది. ఇండిపెండెంట్లు నలుగురు ఉన్నారు. ఒక్కడ చైర్మన్ కోసం సంప్రదింపులు కొనసాగిస్తోంది. కామారెడ్డిలో 49 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 25 కాగా కాంగ్రెస్ 19 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ 16 స్థానాల్లో, బీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. ఈ స్థానంలో చైర్మన్ కోసం కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. రాయికల్ 12 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ ఏడు. కాగా కాంగ్రెస్ 3, బీజేపీ 5, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ ఒక స్థానంలో ఉంది. ఈ స్థానంలో చైర్మన్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అమరచింత, నారాయణపేట మున్సిపాలిటీలు కూడా ఇదే కోవలో ఉన్నాయి.

బీఆర్ఎస్ మద్దతిస్తే..

కాషాయ పార్టీకి అన్నీ కలిసొస్తే.. రెండున్నరేళ్లు బీజేపీ చైర్మన్ గా, మరో రెండున్నరేళ్లు వారికి మద్దతిచ్చే పార్టీ చైర్మన్ గా కొనసాగేందుకు ఒప్పందం చేసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా గతంలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని, ఎవరి మద్దతు తీసుకోబోమని రాష్​ట్ర నాయకత్వం స్పష్టంచేసింది. కానీ ఫలితాల తర్వాత రాష్ట్ర పార్టీ నిర్ణయానికి తిలోదకాలిచ్చినట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చించుకుంటున్నారు. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తే.. కాంగ్రెస్ చేసిన ఫెవికాల్ బంధం విమర్శలు నిజమయ్యాయనేది స్పష్టమవుతుందని పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అంతిమంగా ఈ చైర్మన్ పీఠాల దక్కించుకునే పోరులో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.

Also Read: AK47 Movie: త్రివిక్రంకు కోపం తెప్పించిన ‘ఏకే 47’ సినిమాటొగ్రఫర్.. ఏం చేశారంటే?

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×