Miyapur : మియాపూర్‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతి కాదనడంతో కత్తితో దాడి చేశారు. అడ్డు వచ్చిన యువతి తల్లిపైన కూడా అటాక్ చేశారు. అనంతరం తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ దారుణం మియాపూర్‌లోని ఆదిత్యనగర్‌లో చోటుచేసుకుంది.
సందీప్ అలియాస్ బబ్లూ, బాధితురాలు వైభవి గతంలో ప్రేమించుకున్నారు. అయితే రెండేళ్ల నుంచి వైభవి బబ్లూను దూరం పెడుతోంది. ఇష్టం లేదని చెప్పినా పదే పదే వెంటపడి ఆమెను విసిగించడం ప్రారంభించాడు.
డిసెంబర్ 13న సందీప్ హైదరాబాద్ వచ్చాడు. నేరుగా మియాపూర్‌లోని వైభవి ఇంటికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై అటాక్ చేశాడు. అక్కడే ఉన్న వైభవి తల్లి శోభ ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. బబ్లూ యువతి తల్లి శోభపైన కూడా అదే కత్తితో దాడి చేశాడు.
దీంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. చికిత్స కోసం యువతిని, ఆమె తల్లిని కొండాపూర్ కిమ్స్‌కు తరలించారు. ఇద్దరిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది సందీప్.. ఆ తరువాత తనను తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. విషమపరిస్థితిలో ఉన్న అతన్ని కూడా చికిత్స కోసం గాంధీకి తరలించారు.