Big Stories

Weight Gain : బరువు పెరిగేలా చేసే అరటిపండ్లు

Weight Gain : ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇక మరికొందరైతే సన్నగా ఉన్నామని దిగులు చెందుతుంటారు. బరువు పెరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు నిత్యం అరటి పండ్లు తినడం వల్ల బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అరటి పండ్లు నిజానికి బరువు తగ్గించేందుకు, పెరిగేందుకు రెండు విధాలుగా ఉపయోగపడతాయి. తీసుకునే విధానం వేరువేరుగా ఉంటుంది. నేరుగా తింటే బరువు తగ్గేందుకు సహాయపడతాయి. వాటిని పాలలో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇదే విషయాన్ని డైటీషియన్లు కూడా చెబుతున్నారు. అరటి పండ్లను చాలామంది వ్యాయామం చేశాక తింటారు. దీంతో కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. బరువు తగ్గేందుకు అరటిపండ్లు సహాయపడతాయి. అరటిపండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్, పొటాషియంలు అధిక బరువును తగ్గిస్తాయి. అరటిపండ్లలో ఉండే కార్బోహైడ్రేట్లు బరువు పెంచుతాయి. ఒక అరటిపండు ద్వారా 105 క్యాలరీల శక్తి లభిస్తుంది. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొద్ది మొత్తంలో ఉండే విటమిన్ బి6, సి, యాంటీ ఆక్సిడెంట్లు అరటిపండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అరటిపండ్లలో ఉండే కార్బోహైడ్రేట్లు, పాలలో ఉండే ప్రోటీన్లు రెండిటిని కలిపి తీసుకుంటే బరువు తొందరగా పెరుగుతారు. కాబట్టి సన్నగా ఉండేవారు అరటి పండ్లను పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అరటి పండ్లతో మిల్క్ షేక్ చేసుకుని తాగవచ్చు. లేదా పాలతో కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. అయితే ఇలా తీసుకునేవారు వ్యాయామం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. త్వరగా బరువు పెరిగేందుకు అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News