BigTV English

MLAs with criminal Records: చదువులో వెనక.. కేసుల్లో ముందు..!

MLAs with criminal Records: చదువులో వెనక.. కేసుల్లో ముందు..!

MLAs with criminal Records: వచ్చే తెలంగాణ ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్నవారికి సీట్లు ఇవ్వొద్దని నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఎన్నికల సంఘం ఆయా పార్టీలకు సూచించింది. ఇక.. ఈ ఎన్నికల్లో కొత్తవారికి, విద్యాధికులకు అవకాశం ఇవ్వాలని ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు. ఈ సంగతిని ఇలా పెడితే.. ఇప్పుడు రద్దు కాబోతున్న మన తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులున్నాయి.


రాష్ట్రంలో అన్నిపార్టీలు కలిపి ప్రస్తుతమున్న 118 మంది ఎమ్మెల్యేలకుగాను.. 72 మంది (61%)పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని.. ఇందులో బీఆర్‌ఎస్‌ వారే 59 మంది అని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. బీఆర్‌ఎస్‌కు ఉన్న 101 మంది ఎమ్మెల్యేల్లో ఇది 58 శాతమని తెలిపింది. ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై (86%), ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో నలుగురిపై (67%), బీజేపీకి చెందిన ఇద్దరు (100%) ఎమ్మెల్యేలపై, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఒకరిపై (50%) క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు వారు గత ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారని వివరించింది.

మొత్తంగా 46 మంది (39%) సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. అందులో బీఆర్‌ఎస్‌ వారు 38 మంది అని తెలిపింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, నలుగురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని.. ఒక ఎమ్మెల్యేపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఉందని వివరించింది.


ఇక.. చదువు విషయానికి వస్తే.. తెలంగాణలోని మొత్తం ఎమ్మెల్యేలలో.. 43 మంది (36%) విద్యార్హత 5వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉంది. మరో 69 మంది (58%) గ్రాడ్యుయేషన్‌/ఆపై విద్యార్హత కలిగి ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు డిప్లొమా చేశారు. ఒక ఎమ్మెల్యే తాను సాధారణ అక్షరాస్యుడినని ప్రకటించుకున్నారు.

వయసును గమనిస్తే.. 43 మంది (36%) వయసు 30 నుంచి 50ఏళ్ల మధ్య ఉండగా, 75 మంది (64%) వయసు 51 నుంచి 80 ఏళ్ల మధ్య ఉంది. అయితే.. ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఈ పరిస్థితి మారి.. మరింత మంది యువ ఎమ్మెల్యేలు సభకు వచ్చేలా కనిపిస్తోంది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×