BigTV English

Nagole Crime : నాగోల్ లో బాలుడి మిస్సింగ్.. విషాదాంతం

Nagole Crime : నాగోల్ లో బాలుడి మిస్సింగ్.. విషాదాంతం

Nagole Crime : హైదరాబాద్‌ లోని నాగోల్ పరిధిలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు శవమై కనిపించాడు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. 12 ఏళ్ల మనీష్ ఆదివారం కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం ఓ క్వారీ గుంతలో అతని మృతదేహం లభ్యమైంది. మనీష్ మరణంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.


ఇద్దరు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి చనిపోయాడని అతని మిత్రులు చెప్తున్నారు. భయపడిపోయి మనీష్ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మనీష్ తిరిగి రాకపోవడంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన పోలీసులకు మనీష్ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వాళ్లను పిలిచి అడగ్గా అసలు విషయం బయటపడింది. క్వారీ గుంత నుంచి మనీష్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×