BigTV English

Tamilisai Soundararajan | తెలంగాణకు త్వరలో కొత్త గవర్నర్.. ఇక పుదుచ్చేరికే తమిళసై పరిమితం!

Tamilisai Soundararajan | తెలంగాణకు త్వరలో కొత్త గవర్నర్.. ఇక పుదుచ్చేరికే తమిళసై పరిమితం!

Tamilisai Soundararajan | తెలంగాణకు త్వరలో కొత్త గవర్నర్.. ఇక పుదుచ్చేరికే తమిళసై పరిమితం!

Tamilisai Soundararajan | తెలంగాణ గవర్నర్ గా సేవలు అందిస్తున్న డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ స్థానంలో కొత్త గవర్నర్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఆమెకు బదులుగా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని కేంద్ర ప్రభుత్వం నియమించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి లెప్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమిళిసై ఇకపైన పుదుచ్చేరికే పరిమితం కానున్నారు.


త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ గవర్నర్ పదవి నుంచి ఆమెను తొలగించి ఆ స్థానంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్‌ను నియమించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా తెలంగాణ గవర్నర్‌ను మార్చాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమిళిసై సౌందర్ రాజన్ ఈ రోజు రాత్రి పుదుచ్చేరి నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. మంగళవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగే సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో కొత్త గవర్నర్ గురించి అధికారికంగా ప్రకటన రావొచ్చు.


సెప్టెంబరు 1 2019 నుంచి తమిళ సై తెలంగాణ గవర్నర్‌గా నియమితులు కాగా.. ఆమె సెప్టెంబర్ 9న బాధ్యతలు చేపట్టారు . ఆమె పదవీకాలం 2024 సెప్టెంబర్‌లో పూర్తి కానుంది.

Modi govt, appoint, new Governor, Telangana, Tamilisai Soundararajan, Puducherry, Lok Sabha elections,

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×