E-Paper
Advertisement

కేసీఆర్ కు కొద్దిగా మతిభ్రమించింది.. అందుకే అలా..? ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ కు కొద్దిగా మతిభ్రమించింది.. అందుకే అలా..? ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర, కేంద్ర రాజకీయాలతో పాటు స్థానిక రైతాంగ సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ పాలన , గత బీఆర్ఎస్ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.

రాజకీయ విమర్శలు

Advertisement

ఈనెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని అరవింద్ వెల్లడించారు. ఇదే క్రమంలో కేసీఆర్ తీరుపై మండిపడుతూ.. ఆయనకు మతి భ్రమించిందని, తనను నమ్మిన నాయకులను మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటని విమర్శించారు. తాజాగా బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డిని కూడా ఆయన వదిలిపెట్టరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ శకం ముగిసిందని, ప్రజలు ఆయన్ని పట్టించుకోవడం మానేశారని చెబుతూనే, గ్రామీణ స్థాయి వరకు మత్తు పదార్థాలను చేరవేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆరోపించారు.

రైతాంగ సమస్యలు – బీజేపీ అల్టిమేటం

Advertisement

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు లేదని అరవింద్ విమర్శించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘రైతు పండించిన ప్రతి గింజాను వారం రోజుల్లోగా కొనుగోలు చేయాలి’ అని బీజేపీ తరపున ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో రైతాంగం నుండి పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

పసుపు రైతులు – మోదీ చొరవ

నిజామాబాద్ పసుపు రైతుల గురించి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వల్లనే పసుపు రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు వేయడం, మార్కెట్ ధరలు పెరగడంలో కేంద్రం పాత్ర కీలకమని అరవింద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

Also Read: ఢిల్లీలో చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు.. కాంగ్రెస్ నేతలపై ఎంపీ ఫైర్!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×