Congress: మంత్రిగా పనిచేశారు. బాగా చదువుకున్నారు. రాజకీయ అనుభవం కూడ ఉంది. అందులోనూ మీరు మంచివారు. అయితే ఇది కరెక్ట్ కాదని దేవకద్ర ఎమ్మేల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు వచ్చినట్లు వచ్చి, తన లాయర్లను అనుమతించక పోవడంతో వెనుతిరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఏసీబీ మరోమారు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
కేటీఆర్ విచారణకు వచ్చినట్లు వచ్చి, మళ్లీ తిరిగి వెళ్లిపోవడంపై దేవకద్ర ఎమ్మేల్యే మధుసూదన్ రెడ్డి సెటైర్లు వేశారు. బిగ్ టీవీతో ఎమ్మేల్యే మాట్లాడుతూ.. కేటీఆర్ కి చట్టం పైన గౌరవం లేదన్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికి విచారణకి హాజరు కాలేదని ఎమ్మేల్యే అన్నారు. లాయర్లు కావాలని డ్రామా ఆడి, చివరకు విచారణకు డుమ్మా కొట్టారన్నారు. నిజంగా తప్పు చేయకుంటే విచారణకు హాజరు కావాలి కాని, ఇలా సాకులు చెప్పకూడదని హితవు పలికారు. కేటీఆర్ మంత్రి గా కూడ వ్యవహరించారని, విచారణకు లాయర్ల సహాయం ఎందుకంటూ ప్రశ్నించారు.
కార్యకర్తల మాదిరిగా భయపడుతూ ఇంకెన్ని రోజులు దాక్కుంటారని, నిజంగా తప్పు చేయకుంటే విచారణకి హాజరు కావాలన్నారు. ఒకవేళ విచారణలో ఇబ్బందులు కానీ, ఏమైనా సమస్య ఉంటే కోర్టు కి వెళ్లి పోరాడాలని సూచించారు. విచారణకే హాజరు కాకుండా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై, సీఎం రేవంత్ రెడ్డి పై కావాలనే బురద జల్లుతున్నారని, సోషల్ మీడియా ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్కామ్ జరగగ పోతే గ్రీన్ కో కంపెనీ బాండ్లు ఎందుకు ఇచ్చిందని ఎమ్మేల్యే ప్రశ్నించారు. బాండ్లు తీసుకొని, గ్రీన్ కో కంపెనికి అనుమతులు ఇచ్చారన్నారు. కోర్టు అరెస్ట్ కు మాత్రమే స్టే ఇచ్చిందని, విచారణకు కాదన్నారు. దమ్ముంటే కేటీఆర్ విచారణకు హాజరుకావాలని దేవకద్ర ఎమ్మేల్యే మధుసూదన్ రెడ్డి సవాల్ విసిరారు. కాగా కేటీఆర్ మళ్లీ నోటీసులు అందుకుంటే, ఈసారి విచారణకు వెళ్తారా, లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.
Also Read: China New Virus: హైదరాబాద్ వాసులూ బీ అలర్ట్.. చైనా వైరస్ వచ్చేసింది, ఈ నగరానికి వెళ్తే జాగ్రత్త!
కేటీఆర్.. ఏడ్చడం తగదు
జైలుకు పోతా అని చెప్పిన కేటీఆర్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఎంపీ మాట్లాడుతూ.. కేటీ రామారావు నిజంగానే డ్రామా రావులా వ్యవహరిస్తున్నారని, మంత్రిగా చేసి కూడ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ ఆయన అయ్య సొత్తులా ప్రభుత్వ డబ్బులను ఇష్టారీతిన ట్రాన్స్ఫర్ చేసాడని విమర్శించారు. దానినే విచారణ అధికారులు అడుగుతున్నారన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జీవితాంతం అధికారంలో ఉంటామని కేటీఆర్ భావించారని, ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేవలేదని సోషల్ మీడియా ద్వారా చిల్లర కామెంట్లు చేస్తున్నారని తెలిపారు.