E-Paper
Advertisement

దాహార్తిపై ఎంపీల దండయాత్ర.. ఖమ్మం టు భద్రాద్రి యుద్ధ ప్రాతిపదికన బోర్ల వేట!

దాహార్తిపై ఎంపీల దండయాత్ర.. ఖమ్మం టు భద్రాద్రి యుద్ధ ప్రాతిపదికన బోర్ల వేట!
Advertisement

Drinking Water: స్వేచ్ఛ బ్యూరో: 44 గ్రామాల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు ఎంపీ రఘురాం రెడ్డి రూ.35 లక్షలకు పైగా ఎం.పి.గ్రాంటు నిధులతో ప్రజల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాలోని 44 గ్రామాల్లో రూ.35 లక్షల ,20 వేల నిధులతో కొత్తగా చేతిపంపులను ఏర్పాటు చేయించనున్నారు.

గొంతెండుతున్న ఏజెన్సీ ప్రాంతం..

ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని గిరిజన గూడెల్లో తాగునీటి ఎద్దడి సమస్యకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరిష్కారం చూపారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడి గిరిజనులకు గొట్టపు బావుల ద్వారా మంచినీటిని అందజేసేందుకు నిధులు కేటాయించారు. ఇద్దరు వేర్వేరుగా 67 బోర్‌లు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. వేసవిలో గొంతెండుతున్న ఏజెన్సీ ప్రాంతం దాహార్తిని తీర్చేందుకు , ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నీటి సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీలు ఇద్దరు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు . దీంతో వృద్ధులు, మహిళలకు దూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకునే కష్టాలు తప్పనున్నాయి.

Advertisement

Also read: గందరగోళంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం

వారం రోజుల్లో పనులు పూర్తి కావాలి: ఎం.పి రామసహాయం

​నిధుల అనుమతులు మంజూరైన నేపథ్యంలో పనులను యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఎం.పీ రఘురామిరెడ్డి ఆర్. డబ్ల్యూ.ఎస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.​ తాగునీటి సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే నిధులు కేటాయించినందుకు స్థానిక సర్పంచ్ లు, నాయకులు ఎంపీ రఘురాం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

చర్ల, దుమ్ముగూడెంలకు..

Advertisement

ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని గిరిజన గూడెల్లో తాగునీటి ఎద్దడి సమస్యకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరిష్కారం చూపారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడి గిరిజనులకు గొట్టపు బావుల ద్వారా తాగునీరు ఇచ్చేందుకు నిధులు కేటాయించారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు ఎంపీ రవిచంద్ర స్పందించి తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో రెండు మండలాల్లో 23 మంచినీటి బోర్లకు తన ఎం.పి. గ్రాంటు నిధులు ఇచ్చారు. వీటిలో దుమ్ముగూడెం మండలం లో 15, చర్ల మండలంలో 8 బోర్ల నిర్మాణానికి అయ్యే రూ.35 లక్షలు విడుదల చేశారు. ఎండాకాలం తీవ్రత దృష్ట్యా సత్వరమే బోర్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని కోరారు. భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణలు కృతజ్ఞతలు వద్దిరాజు కు తెలిపారు.

Also read: మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో సక్సెస్ ఫెస్ట్!

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×