REVANTHREDDY : దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీలో ప్రజలు గొప్ప నాయకుడిని చూస్తున్నారని తెలిపారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు వారి సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రకు మద్దతుగా అందరూ కదలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.
80 ఏళ్ల వృద్ధులు కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలను రాహుల్ పరిష్కరిస్తారని జనం నమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఈ దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని రేవంత్ అన్నారు. నవంబర్ 7న తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. రాహుల్‌కు వీడ్కోలు పలికేందుకు మేనూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.