E-Paper
Advertisement

రూపారెడ్డి మర్డర్ కేస్‌లో ఊహించని ట్విస్ట్.. విద్యార్థులే నిందితులా?

రూపారెడ్డి మర్డర్ కేస్‌లో ఊహించని ట్విస్ట్.. విద్యార్థులే నిందితులా?
Advertisement

Principal Murder: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 11న జరిగిన ఈ ఘాతుకంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పూర్వ, ప్రస్తుత విద్యార్థుల హస్తం?

Advertisement

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, సుమారు 80 మందిని సమగ్రంగా విచారించారు. విచారణ ఆధారంగా.. చెడు వ్యసనాలకు బానిసలైన స్థానిక తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులే ఈ హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఈ పాఠశాలకు చెందిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. జేబీ కాలనీలోని ప్రిన్సిపల్ నివాసంలోనే ఈ ప్లాన్ అమలు చేసినట్లు అనుమానిస్తున్నారు.

ప్రత్యేక బృందాల దర్యాప్తు..

Advertisement

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానితులైన విద్యార్థులను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విలాసాలకు, చెడు అలవాట్లకు డబ్బులు చాలకనే వీరు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది.

నగదు చోరీ అనుమానాలు

రూపారెడ్డిని హత్య చేసిన అనంతరం, ఆ విద్యార్థులు ప్రిన్సిపల్ వద్ద ఉన్న సుమారు రూ. 4 లక్షల నగదును చోరీ చేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ చోరీ కోసమే పక్కా పథకం ప్రకారం హత్య చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బుధవారం సాయంత్రం లోగా వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

Also Read: టిమ్స్ ఆస్పత్రి వివాదం.. మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్!

Tags

Related News

టిమ్స్ ఆస్పత్రి వివాదం.. మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్!

మీరు వస్తానంటే మేము వద్దంటామా? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు BRS ఓపెన్ ఆఫర్!

బాండ్ పేపర్ రాసిస్తా.. తెలంగాణలో గెలిచేది బీజేపీయే!- ధర్మపురి అర్వింద్

సీఎం రేవంత్ బిజీ బిజీ.. నేడు CWC భేటీ.. అనంతరం లండన్, న్యూయార్క్ టూర్లు!

22A అంశం పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై బండి సంజయ్ ఫైర్!

Big Stories

Advertisement
×