E-Paper
Advertisement

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?
Advertisement

Durga Mata Pandal: స్వేచ్చ బ్యూరో: దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పందిళ్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న నిర్వాహకులకు మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసులు కీలక సూచనలు చేశారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి మండపాలు ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా ఆన్‌లైన్ అనుమతి పొందాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ. రంజిత్ కుమార్ స్పష్టం చేశారు. దుర్గామాత మండపాలు ఏర్పాటుకు సంబంధించిన Durga Mata Pandal Application ప్రస్తుతం అందుబాటులో ఉందని పోలీసులు తెలిపారు.

వెబ్‌సైట్‌..

పండాల్ నిర్వాహకులు policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి మండపాలు ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలు, సంప్రదింపు నంబర్లు తదితర పూర్తి సమాచారాన్ని నమోదు చేసి అనుమతి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నిబంధనలు పాటించాల్సిందే.. మండపాల ఏర్పాటు విషయంలో నిర్వాహకులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా రోడ్లు, ప్రధాన కూడళ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. మండపాలా వద్ద విద్యుత్ భద్రత, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు మార్గాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Also read: సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

సౌండ్ సిస్టమ్.. 

అలాగే భక్తులు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. సౌండ్ సిస్టమ్‌పై ఆంక్షలు.. మండపాలా వద్ద లౌడ్‌స్పీకర్లు, సౌండ్ సిస్టమ్ వినియోగించే సమయంలో అనుమతించిన పరిమితులను దాటకూడదని పోలీసులు హెచ్చరించారు. అమలులో ఉన్న శబ్ద నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా అసభ్యకరమైన, వివాదాస్పదమైన లేదా ఇతరుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు, బ్యానర్లు, ప్రదర్శనలకు తావివ్వకూడదని సూచించారు.

100 శాతం ఆన్‌లైన్‌లో నమోదు..

Advertisement

మంటపాలా వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వొద్దని నిర్వాహకులకు సూచించారు. 100 శాతం ఆన్‌లైన్ నమోదు చేయాలి నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయబోయే ప్రతి దుర్గామాత మంటపాలా వివరాలను 100 శాతం ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ముందస్తు అనుమతులు పొందేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని SHO ఏ. రంజిత్ కుమార్ కోరారు. ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరిగేలా పోలీసులకు, ఇతర సంబంధిత శాఖలకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని నర్సాపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also read: పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

Tags

Related News

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు పై సీపీఐ(ఎం) ఉద్యమ బాట!

యజమాని లేకుండా నకిలీ GPA సృష్టించి కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు.. ఎక్కడంటే?

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సీఎం రేవంత్ బిగ్ గిఫ్ట్?

హామీ ఇచ్చి నీళ్లు ఆపేశారా.. జూరాల ప్రాజెక్టుపై ఆశతో ఎదరుచూస్తున్న అన్నదాతలు!

బిగ్ బ్రేకింగ్.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ అగ్నిప్రమాదం!

Big Stories

Advertisement
×