BigTV English

Traffic fines: రాంగ్ రూట్ 1700, ట్రిపుల్ రైడింగ్ 1200.. బాదుడే బాదుడు..

Traffic fines: రాంగ్ రూట్ 1700, ట్రిపుల్ రైడింగ్ 1200.. బాదుడే బాదుడు..

Traffic fines: భరత్ అనే నేను.. సినిమా గుర్తుందిగా. అందులో, సీఎం రోల్ లో హీరో మహేశ్ బాబు ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినంగా ఉంటాడు. రెడ్ సిగ్నల్ దాటితే 5వేలు, జీబ్రా లైన్స్ క్రాస్ చేస్తే 10వేలు ఫైన్లు వేస్తాడు. వాహనదారులు గొడవ గొడవ చేసినా.. తగ్గేదేలే అంటాడు. హైదరాబాద్ పోలీసులు సైతం మహేశ్ బాబును ఆదర్శంగా తీసుకున్నారు కాబోలు. ఎడాపెడా ట్రాఫిక్ చలాన్లు బాదేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లతో భారీగా ఫైన్లు వసూలు చేస్తున్నారు.


లేటెస్ట్ గా, ట్రాఫిక్ రూల్స్ ను మరింత స్ట్రిక్ట్ చేశారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మరోసారి ట్రాఫిక్ ఫైన్స్ పెంచేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే ఏకంగా 1700 ఫైన్ వేయనున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 ఫైన్.

ఈ నెల 28 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. గీత దాటితే.. జరిమానా బాదేస్తామని చెబుతున్నారు. 1700 పెడితే.. సుమారు 15 లీటర్ల పెట్రోల్ వస్తుంది అనవసరంగా రాంగ్ రూట్ లో వెళ్లి జేబులు గుల్ల చేసుకోవద్దని సూచిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ రిస్కే కాదు.. ట్రాఫికోళ్లకు చిక్కితే కాస్ట్లీ కూడా కాబోతుంది. అందుకే, ట్రాఫిక్ బాదుడు తప్పాలంటే.. బాధ్యతగల పౌరులుగా నిబంధనలు పాటిస్తే సరి.


Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×