Sigachi Blast Incident: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి బ్లాస్ట్‌లో హృదయ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నూతన వదూవరులు మిస్ అవ్వడం అందరిని కలచివేస్తోంది. ఏపీలోని జమ్మలమడుగుకు చెందిన నికిల్ రెడ్డి, నామాల రమ్యకు నెల క్రితమే వివాహం జరిగింది. అనంతరం సిగాచి పరిశ్రమలో ఉద్యోగానికి చేరారు. ప్రమాదం జరిగిన తర్వాత వారి ఆచూకీ తెలియకపోవడంతో.. నవనవధువులు ఎమయ్యారో అని ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న నిఖిల్, రమ్య ఆషాఢ మాసం తర్వాత.. పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబాలు.. దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని.. సిగాచి అనే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల అవతల పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి.
ఈ ఘటనలో మృతుల సంఖ్య 42 కి చేరింది. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అనేక మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్‌చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్‌లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్‌ను ఉత్పత్తి చేస్తారు. సోమవారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్‌కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్‌లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరాయం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: చిన్న పిల్లలు ఉన్నారు భోజనం, బస ఏర్పాట్లు చెయ్యండి.. సీఎం కీలక ఆదేశాలు
పాశమైలారం ఘటన తీవ్ర విషాదకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు ముఖ్యమంత్రి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం అందచేసేలా చూస్తామన్నారు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
పాశమైలారం ఘటనలో వెలుగులోకి వచ్చిన మరో విషాదం
ప్రమాద సమయంలో కంపెనీలో పని చేస్తోన్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ గల్లంతు
ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న నిఖిల్, రమ్య
ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్న ఇరు… pic.twitter.com/6ZI4aO5gK4
— BIG TV Breaking News (@bigtvtelugu) July 1, 2025