Viral Video: వింతలు.. విశేషాలకు కేరాఫ్‌గా మారుతోంది ఉత్తరప్రదేశ్. హాపూర్ కారు ప్రమాదం హాలీవుడ్‌లో యాక్షన్ సీన్స్‌ని తలపించేలా ఉంది. ఈ ఘటనలో ఓ యువకుడి మృత్యువాతపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ సమీపంలోని 9 వ నెంబరు జాతీయ రహదారి ఉంది. ఆ రోడ్డు పక్కన రాజా జీ హవేలీ హోటల్ ఉంది. అది చాలా కాస్ట్లీ హోటల్ అని చాలామంది చెబుతున్నారు.సోమవారం రాత్రి హోటల్ నుంచి చాలామంది భోజనం చేసి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ బయటకు వస్తున్నారు. కొంతమంది తమ వెహికల్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇంతలో వేగంగా ఓ కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి హోటల్ బయట ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది.ప్రాణాలు కోల్పోయిన యువకుడు, తన స్నేహితురాలి పుట్టినరోజు జరుపుకోవడానికి హోటల్‌కి వచ్చాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు.
కారు వేగానికి డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. హోటల్ బయట చాలామంది నిలబడి ఉండగా అకస్మాత్తుగా అధిక వేగంతో దూసుకొచ్చింది. ఆ వాహనం చాలామందిపై దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులను గాల్లోకి విసిరివేయడం కనిపించింది. నలుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు.
ALSO READ: విమానం హ్యాండ్ బ్యాగ్ ధరతో ఓ ఇల్లు కొనేయవచ్చు
ఘటన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన వారిని హోటల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
మరోవైపు జూన్ మొదటివారంలో యూపీలోని ఝాన్సీ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగింది. సిద్ధార్థ్‌నగర్ నుండి మహారాష్ట్రలోని మొబారాకు రెండు కుటుంబాలు వెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెల్సిందే.
खौफनाक हादसे का ये वीडियो हापुड़ का है.. नेशनल हाईवे 9 पर बने राजा हवेली होटल में तेज रफ्तार कार लोगों को टक्कर मारते हुए घुस गई.. हादसे में अजीत पाल नाम के युवक की मौत हो गई है. होटल में अजीत पाल की प्रेमिका की बर्थडे पार्टी चल रही थी. अजीत प्रेमिका को विश करने वहां गया था. इसी… pic.twitter.com/YDgfJRDsDF
— Vivek K. Tripathi (@meevkt) July 1, 2025